Sekhar Kammula Kubera : హ్యాపీ డేస్, లీడర్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి ఫీల్ గుడ్ సినిమాలు తీయడంలో నంబర్ వన్ డైరెక్టర్ అయిన శేఖర్ కమ్ముల ఈ మధ్యనే ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో మంచి హిట్లు అందుకున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల ఇప్పుడు కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కుబేర అనే ఆసక్తికరమైన టైటిల్ ను లాక్ చేశారు దర్శకనిర్మాతలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. సినిమా టైటిల్ కుబేర అని పెట్టినప్పటికీ ఈ పోస్టర్లో ధనుష్ ఒక బీదవాడి గెటప్ లో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో అసలు కుబేర అనే టైటిల్ ఎందుకు పెట్టి ఉంటారు అని సోషల్ మీడియాలో డిస్కషన్ లు కూడా మొదలయ్యాయి. ఈ రకంగా సినిమాకి మంచి హైప్ కూడా లభించింది.


కానీ తాజాగా ఇప్పుడు చిత్ర నిర్మాతలకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే కుబేర అనే టైటిల్ ను కార్మికుండా నరేంద్ర అనే నిర్మాత ఫిలిం ఛాంబర్ లో నమోదు చేసేసారట. దీంతో తన టైటిల్ ను వేరొకరికి ఎలా ఇస్తారు అని ఫిలిం ఛాంబర్ ను నిలతీయడానికి ప్రయత్నించాడు నరేంద్ర. కానీ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తాజాగా ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. 


దీంతో చేసేదిలేక ధనుష్ సినిమాని నిర్మిస్తున్న నిర్మాతలు ఇప్పుడు టైటిల్ విషయంలో ముందుగానే లాక్ చేసుకున్న నిర్మాతతో వాదించాల్సిన అవసరం వచ్చి పడింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ టైటిల్ కి సంబంధించిన డిస్కషన్లు జరుగుతున్నాయని తెరుస్తోంది. ఒకవైపు డిస్కషన్లు జరుగుతున్నప్పుడే మరోవైపు నిర్మాత ఆవేశంగా కోర్టుమెట్లు ఎక్కాల్సిన అవసరం ఏమి వచ్చింది అని ఇంకా తెలియాల్సి వస్తుంది. 


ఏదేమైనా కుబేర టైటిల్ విషయంలో ఈ ఇద్దరు నిర్మాతలు ఎలాంటి నిర్ణయానికి వస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ధనుష్ సినిమాకి కూడా కుబేర అనే టైటిల్ బాగా సెట్ అవుతుంది అని అనుకుంటే నిర్మాతలు సినిమాకి ధనుష్ కుబేరా అని కూడా పెట్టే అవకాశం ఉంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కి సిద్ధం అవుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం లో మాత్రమే కాక హిందీలో కూడా విడుదల కాబోతోంది.


Also read: Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook