Dhanush - Captain Miller OTT News: ధనుశ్ కోలీవుడ్ హీరో అయినా టాలీవుడ్‌లో కూడా ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలయింగ్ ఉంది. రీసెంట్‌గా ఇతను కెప్టెన్ మిల్లర్ వంటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీతో పలకరించారు. తమిళంలో ఓ మోస్తరుగా నడించిన ఈ సినిమా తెలుగులో ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ మినిమం కలెక్షన్స్‌ను రాబట్టలేక చేతులేత్తేసింది. తాజాగా మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో నేటి అర్ధరాత్రి నుంచి తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వెర్షన్స్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక థియేటర్స్‌లో ఈ సినిమాను మిస్ అయినవారు ఈ సినిమాను ఇపుడు ఓటీటీలో ఎంచక్కా చూడొచ్చన్నమాట. అక్కడ ఈ సినిమా ఏ మేరకు వ్యూవర్ షిప్ రాబడుతుందో చూడాలి. ఇక ధనుశ్ విషయానికొస్తే..  రజినీకాంత్ అల్లుడగానే కాకుండా అతని కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన తన సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను పలకరిస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 'సార్' మూవీతో తెలుగులో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే మంచి కలెక్షన్స్ రాబట్టింది.  'సార్' వంటి సాలిడ్ హిట్‌తో బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకున్న ధనుశ్ రీసెంట్‌గా 'కెప్టెన్ మిల్లర్‌' సినిమాతో పలకరించాడు. తమిళంలో ఓ మోస్తరు వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి సీజన్ కాబట్టి కాస్తో కూస్తో కలెక్షన్స్  వచ్చాయి. అక్కడ విడుదలైన రెండు వారాల తర్వాత తెలుగులో రిలీజైన ఈ మూవీ ఇక్కడ మంచి వసూళ్లను రాబడుతుందని అందరు అనుకున్నారు. కానీ  ఈ సినిమా ఇక్కడ బొక్క బోర్లా పడింది. రిపబ్లిక్ డే హాలీడేను ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది.


మొత్తంగా తెలుగులో రూ. కోటి లోపు షేర్ మాత్రమే సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా రూ. 1.9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి థియేట్రికల్ రన్ ముగించుకుంది. మొత్తంగా థియేటర్ రెంట్ రాబట్టలేక చేతులెత్తేసిందనే చెప్పాలి. రూ. 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇంకా రూ. 3 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తమిళంలో ఈ సినిమా రూ. 40 కోట్ల షేర్ (రూ. 75 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.  


కెప్టెన్ మిల్లర్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం వెనక పెద్ద రీజనే ఉంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ అయివుంటే పరిస్థితి వేరేలా ఉండేదనేది క్రిటిక్స్ మాట. తమిళంలో ముందుగా రిలీజై టాక్ తేడా కొట్టడంతో ఇక్కడ పెద్దగా బజ్ ఏర్పడలేదు. దీంతో 'కెప్టెన్ మిల్లర్' నిండా మునిగిపోయింది. త్వరలో ధనుశ్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా ధనుశ్ తెలుగులో మళ్లీ తన మార్కెట్ నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి. 


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook