OTT Releases : ఒకే రోజు ఓటీటీలోకి 18 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా ఉన్నవి మాత్రం అవే
Dhanush SIR OTT Release ధనుష్ సార్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా గందద గుడి సైతం రేపే ఓటీటీలోకి రాబోతోంది. ఇక రేపు ఒక్క రోజే పలు ఓటీటీ సంస్థలో పద్దెనిమిది సినిమాలు రాబోతోన్నాయి.
Dhanush SIR OTT Release Date ప్రస్తుతం శుక్రవారం వస్తోందంటే.. థియేటర్ల వద్ద కంటే ఓటీటీలోనే ఎక్కువ సందడి కనిపిస్తోంది. రేపు ఒక్క రోజే ఓటీటీలో పద్దెనిమిది సినిమాలు రిలీజ్ కాబోతోన్నాయి. రావడానికి పద్దెనిమిది సినిమాలున్నా కూడా అందులో మూడు నాలుగు సినిమాలే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. అందులో ధనుష్ సార్, సుహాస్ రైటర్ పద్మభూషణ్ సినిమాలపై మెయిన్ ఫోకస్ ఉంది. ఇక ఆహాలో, జీలోనూ కొత్త సినిమాలు వస్తున్నాయి.
ధనుష్ నటించిన సార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్‌గా నిలిచింది. తమిళంలో వాతి అంటూ రిలీజ్ కాగా.. ఈ సినిమా ఏకంగా వంద కోట్లను కొల్లగొట్టేసింది. ఇలా క్లాస్ సినిమాతోనూ మాస్ కలెక్షన్లను రాబట్టేశాడు ధనుష్. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ మీద కూడా అందరి దృష్టి పడింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా రేపటి నుంచి అందుబాటులోకి రాబోతోంది.
సుహాస్‌కు కలర్ ఫోటో తరువాత డిమాండ్ పెరిగింది. హీరోగానూ ఆఫర్లు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైటర్ పద్మభూషణ్ అంటూ అందరినీ మెప్పించాడు. ఈ చిత్రం చిన్నగా మొదలై పెద్ద సునామినే క్రియేట్ చేసింది. ఈ సినిమాకు వసూళ్లతో పాటుగా ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ చిత్రం జీ5లో రేపటి నుంచి సందడి చేయనుంది.
ఇవి ఇలా ఉంటే.. ఆహాలో కొత్త ప్రాజెక్ట్ రాబోతోంది. పుష్ప ఫేమ్ కేశవ హీరోగా ఈ సినిమా రెడీ అయింది. సత్తిగాని రెండెకరాలు అంటూ రాబోతోన్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి ఆహాలో సత్తిగాని రెండెకరాలు స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్‌లో కాట్ అవుట్ క్రైమ్, కరప్షన్, క్రికెట్, కుత్తే, ది మెజీషియన్స్ ఎలిఫెంట్, నాయిస్ రాబోతోన్నాయి.
పునీత్ రాజ్ కుమార్ చివరగా నటించిన గందద గుడి సినిమా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో రాబోతోంది. డామ్ అనే మరో సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీలివ్‌లో రాకెట్ బాయ్స్ అనే సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Also Read: Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!
Also Read: Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook