అట్లూరి వెంకీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా సినిమా నిర్మితమౌతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసిన ధనుష్ అభిమానులకు నిరాశే ఎదురైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాట స్టార్ నటుడిగా వెలుగొందుతున్న రజనీకాంత్ అల్లుడు ధనుష్  హీరోగా ద్విభాషా చిత్రం వస్తోంది. అట్లూరి వెంకీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళంలో వాతి అని..తెలుగులో సర్ అని టైటిల్స్ ఖరారయ్యాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వెల్లడైంది. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందనే అప్‌డేట్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాల్సి ఉండగా..కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాను ఫిబ్రవరి 17, 2023లో విడుదల చేయనున్నట్టు ప్రకటితమైంది.


ఈ సినిమాలో మళయాల నటి సంయుక్తా మీనన్ కథానాయికగా నటించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.


Also read: Rakul Preet Singh Pics: బ్లాక్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. కాలు పైకెత్తి మరీ పోజులు! వైరల్ పిక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook