Gagan Vihari Gaangeaya Movie  టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త రకం సినిమాలు వస్తూ ఉన్నాయి.. కొత్త ప్రొడక్షన్ కంపెనీలు వస్తూనే ఉన్నాయి. ఓటీటీ, థియేటర్ అంటూ పోటీ నెలకొన్న ఈ తరుణంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాన్ ఇండియన్ రేంజ్‌లో ఓ సినిమాను నిర్మించేందుకు ఎం విజయ శేఖర్ రెడ్డి, టి. హేమ కుమార్ రెడ్డి ముందుకు వచ్చారు. విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద రాబోతోన్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ శాఖలను బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ భుజాన వేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధర్మపురి సినిమాతో హీరోగా మెప్పించిన గగన్ విహారి మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో గగన్‌కు జంటగా.. అవ్యుక్త నటిస్తోంది. నేడు లాంఛనంగా ప్రారంభించిన ఈ మూవీ కార్యక్రమానికి దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్‌కు దర్శకులు సముద్ర క్లాప్ కొట్టగా.. సమర్పకులు ఎం విజయ శేఖర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 


రామానాయుడు గారిలా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాను నిర్మిస్తున్నామని చిత్ర దర్శకుడు బి. రామచంద్ర శ్రీనివాస కుమార్  అన్నారు. ఈ సినిమాను జాతీయ స్థాయిలో ఐదు భాషల్లో నిర్మిస్తున్నామని తెలిపారు. జాతీయ సమగ్రతను చాటి చెప్పేలా ఉంటుందని అన్నారు. గాంగేయ సినిమాను నేడే ప్రారంభించామని, అందరి సహకారంతో త్వరగా సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నామని నిర్మాత టి. హేమ కుమార్ రెడ్డి అన్నారు.


చాలా మంచి కథతో ఈ సినిమా రాబోతోందని ఎం విజయ్ శేఖర్ రెడ్డి అన్నాడు. హీరో గగన్ విహారి మాట్లాడుతూ.. ధర్మపురి సినిమా తరువాత ఆడియెన్స్ అంతా కూడా తనను ఫుల్ కమర్షియల్ సినిమా చేయమని అడిగారని చెప్పుకొచ్చాడు. అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా ఇదని మంచి సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నామని చెప్పుకొచ్చాడు. తెలుగులో ఇది మొదటి చిత్రమని హీరోయిన్ తెలిపింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు, హీరో సుమన్ కూడా నటించాడు.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook