Difference Between Gross, Net and Share of a Movie Collection: సాధారణంగా సినిమా కలెక్షన్స్ విషయంలో అందరికీ అనేక అనుమానాలు ఉంటాయి. దర్శక నిర్మాతలు వెల్లడించే కలెక్షన్లు నిజమా కాదా? అంటూ చాలామంది అనుమానపడుతూ ఉంటారు. నిజానికి దర్శక నిర్మాతలు లేదా సినిమా యూనిట్ ఎక్కువగా గ్రాస్ వసూళ్లకు సంబంధించిన ఫిగర్ ని తమ కలెక్షన్స్ గా వెల్లడిస్తూ ఉంటారు. కానీ ట్రేడ్ వర్గాల వారు మాత్రం ఎక్కువగా షేర్ కౌంట్ మాత్రమే లెక్క వేస్తూ ఉంటారు.  అసలు ఈ షేర్, గ్రాస్ అలాగే నెట్ అంటే ఏమిటి? ఎందుకు ఇలా వేర్వేరు లెక్కలు ఉంటాయి? అనే విషయం మీద చాలామందికి అనేక అనుమానాలు ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మాకు ఉన్న సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సాధారణంగా గ్రాస్ అంటే మొత్తంగా అమ్మిన టికెట్ల మీద వచ్చే డబ్బులు. అంటే తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా మూడు లక్షల టికెట్లు తెగితే ఆ మూడు లక్షల టికెట్లకు ఎంత ఆదాయం వచ్చింది? అనేది గ్రాస్ గా లెక్క వేస్తారు. అదే షేర్ విషయానికి వస్తే థియేటర్ల రెంట్ అలాగే మెయిన్టెనెన్స్ ఛార్జీలను ఈ గ్రాస్ వసూళ్ల నుంచి మినహాయించి ఆ మిగిలిన డబ్బును షేరుగా లెక్క వేస్తారు. అంటే ఈ డబ్బు మాత్రమే థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు అందుతుంది. ఇక నెట్ విషయానికి వస్తే గ్రాస్ లో నుంచి ఎంటర్టైన్మెంట్ టాక్స్ అంటే ప్రభుత్వానికి వెళ్లే వినోద పన్ను మినహాయిస్తే దాన్ని నెట్ కలెక్షన్స్ అంటారు.


 ఉదాహరణకు ఎంటర్టైన్మెంట్ టాక్స్ 30% అయితే గనుక ప్రేక్షకులు 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే అందులో 30 రూపాయలు టాక్స్ రూపంలో గవర్నమెంట్ కి వెళుతుంది. అయితే ఈ టాక్స్ పర్సంటేజ్ అనేది సినిమా సినిమాకు మారుతూ ఉంటుంది. అది డైరెక్ట్ రిలీజ్ సినిమానా? లేక డబ్బింగ్ సినిమానా? అనేదాన్ని బట్టి సినిమా టాక్స్ పర్సంటేజ్ మారుతూ ఉంటుంది. తమిళనాడులో విడుదల చేసే తెలుగు సినిమాలకు అక్కడి ప్రభుత్వం టాక్స్ ఎక్కువ వసూలు చేస్తుంది. అయితే ఈ మధ్య హైర్స్ అనే మరో విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.


ఈ హైర్స్ అంటే ఏమిటంటే ఒక జిల్లా మొత్తాన్ని దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్ జిల్లాలో ఒక భాగాన్ని అంటే ఒక సిటీనో  లేక టౌనో వేరే డిస్ట్రిబ్యూటర్ కి థర్డ్ పార్టీ కింద అమ్మేస్తే దాన్ని హైర్స్ అంటారు. ఉదాహరణకు విజయవాడ సిటీ మొత్తాన్ని కోటి రూపాయలకు గనుక కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ అమ్మేస్తే అక్కడ సినిమా ఎంత కలెక్ట్ చేసినా సరే కోటి రూపాయల మేర షేర్ వసూళ్లు మాత్రమే నమోదు అవుతాయి. ఇక ఎక్కువగా హిందీ సినిమా కలెక్షన్లను నెట్ ఆధారంగా ప్రకటిస్తూ ఉంటారు. కానీ మన తెలుగు సినిమా కలెక్షన్లను షేర్ బేసిస్ మీద లెక్క వేస్తూ ఉంటారు. ఇవి ట్రేడ్ వర్గాల వారు లెక్కలు వేసేవి. కానీ సినిమా యూనిట్లు మాత్రం గ్రాస్ వసూళ్లనే అనౌన్స్ చేస్తూ ఉంటారు.


Also Read: Priyanka Singh Marriage: పెళ్లికి సిద్దమైన ప్రియాంక సింగ్.. హల్దీ ఫోటోలు వైరల్!
Also Read: OTT vs Bollywood: ఓటీటీ అంటే ఏంటి, ఓటీటీ.. బాలీవుడ్‌కు ప్రధాన ఆటంకంగా ఎందుకు మారింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి