సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput )... బాలీవుడ్‌లో ఇప్పుడు ఈ పేరు గల నటుడు మనమధ్య లేకున్నా... అతడి పేరు మాత్రం ఇంకా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. దిల్ బెచారా మూవీతో ఆడియెన్స్‌కి ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూనే.. తాను మాత్రం అర్ధాంతరంగా తనువు చాలించిన తీరు పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. పరిశ్రమకు ఎంతో మంది నటులు వచ్చి వెళ్లినప్పటికీ... వాళ్ల సినీ ప్రస్థానం వేరు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రస్థానం వేరు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చాడు. ఏ గాడ్ ఫాదర్ లేకుండానే తనని తాను నిరూపించుకున్నాడు. అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితేనేం... బ్యాడ్ లక్.. ఎంత శ్రమపడినా.. పరిశ్రమలో, జీవితంలో తనని ఎదగనివ్వని వాళ్లతో పోరాడలేకపోయాడు.. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా.. అవి ఎదుర్కున్నాడే తప్ప ఎవ్వరినీ ఏమీ అనలేదు.. ఎవరినీ విమర్శించలేదు. ఆఖరికి ఆ తీవ్ర ఒత్తిళ్ల మధ్యే విధి ముందు తలొంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచారా తాజాగా ఓటిటి ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే హాలీవుడ్ చిత్రానికి హిందీ రీమేక్‌గా తెరకెక్కిన దిల్ బెచారా మూవీ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ( Also read: Justice for Sushant: సుశాంత్‌కు న్యాయం జరిగేందుకు ఫోరం ఏర్పాటు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన సంజనా సంఘి అనే కొత్త హీరోయిన్ జంటగా నటించింది. విచిత్రమో, యాదృచ్ఛికమో కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి ఇదే చివరి చిత్రం కాగా.. సంజనా సంఘికి ఇదే తొలి సినిమా. జార్ఖండ్ లోని జంషేడ్‌పూర్ బ్యాక్‌డ్రాప్‌‌తో మొదలై.. కొంత భాగం ప్యారిస్‌ని సైతం చుట్టొచ్చిన ఈ సినిమాను ముఖేష్ చాబ్రా డైరెక్ట్ చేశాడు అనేకంటే.. ఎంతో అందంగా తెరకెక్కించాడు అని చెప్పుకోవచ్చు. Also read: Kangana Ranaut on Sushant`s suicide: సుశాంత్‌ది సూసైడ్ కాదు.. పక్కా మర్డర్


దిల్ బెచారా మూవీలో సంజనా సంఘి థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ జీవితంపై పెద్దగా ఆశలు లేని కిజి బసు అనే యువతి పాత్ర పోషించింది. మరోవైపు అందుకు విరుద్ధమైన పాత్రలో, ఎంతో ఆశావాద దృక్పథంతో, ఎప్పుడూ నవ్వుతూ ముందుకు సాగిపోయే ఇమాన్యుయెల్ రాజ్‌కుమార్ జూనియర్ అనే యువకుడి పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కనిపించాడు. ఈ సినిమాలో దర్శకుడు హీరో పాత్రకు పెట్టిన ముద్దు పేరే మ్యానీ. కానీ మ్యానీ చిరునవ్వు వెనుక విషాదం ఉందనే సంగతి ఎవ్వరికీ తెలీదు. ఆస్టియోసర్కోమా అనే వ్యాధితో బాధపడుతున్న మ్యానీకి శస్త్రచికిత్స ద్వారా ఎడమ కాలు తొలగించాల్సి వస్తుంది. అయినప్పటికీ తన బాధను ఎవ్వరికీ తెలియనివ్వకుండా.. తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ.. అందరినీ తన నవ్వుతోనే పలకరించడం ఒక అలవాటుగా చేసుకున్న మట్టి మనిషి మ్యానీ. Also read: RGV: పరాన్న జీవి టీజర్‌పై వర్మ కౌంటర్


మ్యానీ పరిచయంతో కిజి బసు జీవితమే మారిపోతుంది. అన్ని ప్రేమ కథల్లాగే మొదట మ్యానీని ద్వేషించిన కిజి.. మ్యానీ మ్యానరిజం, నైజం చూశాకా అతడితో ప్రేమలో పడిపోతుంది. మ్యానీకి ఓ మంచి స్నేహితుడున్నాడు. అతడి పేరే జేపీ. శాహిల్ వైద్ ఈ పాత్ర పోషించాడు. బీహార్‌కి చెందిన జేపీకి ఎప్పటికైనా ఓ భోజ్‌పురి చిత్రాన్ని తెరకెక్కించాలనేది ఓ కల. అతడి చిత్రానికి మ్యానీనే హీరో. జేపీకి ఓ సమస్య ఉంది. అప్పటికే ఎడమ కంటి చూపు కోల్పోయిన జేపీకి.. కుడి కంటిచూపు కూడా కోల్పోయే పరిస్థితి రావడంతో జేపి ముందు తన కలను నెరవేర్చుకోవడానికి ఎంతో సమయం లేదు. అలా అతి కొద్ది కాలంలోనే తన డ్రీమ్ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే లక్ష్యంతో పని మొదలుపెట్టిన జేపికి మ్యానీ సహాయసహకారాలు అందిస్తాడు. జేపి చిత్రంలో హీరోయిన్‌గా చేయాల్సిందిగా కిజిని కోరుతాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ మ్యానరిజం అంటే ఇష్టపడే మ్యానీ అడిగితే కిజి కాదనకుండా ఉంటుందా ? అలా ఆ చిత్రం పట్టాలెక్కుతుంది. 


Also read: వైరల్‌గా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి INSTAGRAM POST


జేపి డైరెక్ట్ చేస్తున్న చిత్రం మధ్యలో ఉండగానే ఒక సర్జరీ అనంతరం అతడు కంటిచూపును కోల్పోవడం.. జేపి డ్రీమ్ ప్రాజెక్టుకు మరో ఆటంకం ఎదురవడం.. వెనువెంటనే జరిగిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది ? ఆ చిత్రాన్ని మ్యానీ, కిజి ఎలా పూర్తి చేశారు ? కిజి కల నెరవేర్చడం కోసం మ్యానీ ఆమెని ప్యారిస్ తీసుకెళ్తాడు. అక్కడ ఏం జరిగింది ? మ్యానీతో పీకల్లోతు ప్రేమలో పడిన కిజి.. అతడికి ప్రపోజ్ చేసిందా ? కిజి లవ్ ప్రపోజ్ చేసేటప్పటికి మ్యానీ ఆరోగ్య పరిస్థితి ఏంటి ? చనిపోతూ చనిపోతూ మ్యానీ ఎటువంటి సందేశాన్ని ఇచ్చాడనేదే దిల్ బెచారా మిగతా కథనం. Also read: Ram Charan tweet: రామ్ చరణ్ ట్వీట్ వెనుకున్న మతలబేంటి


బతికినంత కాలం పాజిటివ్ దృక్పథంతో బతకడమే తెలిసిన మనిషిగా మ్యానీ మనకు ఎంతో మంచి సందేశాన్ని ఇచ్చి మన మధ్య లేకుండానే వెళ్లిపోవడం బాధాకరం. ఈ సినిమాలో బతికినంత ఎలాగైతే నవ్వుతూ బతికాడో.. నిజ జీవితంలో కూడా సుశాంత్ అలాగే నవ్వుతూ బతికాడు. సుశాంత్ పేరు వింటే చాలు.. ముందుగా గుర్తుకొచ్చేది అతడి నవ్వు మొఖమే. దిల్ బెచారా సుశాంత్‌కి ఆఖరి చిత్రమే కావొచ్చేమో కానీ... అతడిని అభిమానించే వాళ్లకు ఎందరికో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే దృశ్యకావ్యం అవుతుందంటే అతిశయోక్తి కాదేమో!! ప్రతీ సినిమా ఓ సందేశాన్ని ఇస్తుంది. అలాగే దిల్ బెచారా మూవీతో బతకడం ఎలాగో నేర్పిన మ్యానీ ఇంకా మన మధ్య ఉండుంటే ఇంకెంత బాగుండేదో అనిపించేలా సుశాంత్ ఈ పాత్రలో జీవించాడు. తన మోము ఆడియెన్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోయేలా మెస్మరైజ్ చేశాడు. Also read: Sushant Singh Rajput: అర్జున్ కపూర్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్స్


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ యాక్టింగ్, దర్శకుడు ముఖేష్ చాబ్రా డైరెక్షన్, ఏ.ఆర్. రెహ్మాన్ అందించిన మ్యూజిక్, కొత్తమ్మాయే అయినప్పటికీ.. తొలి సినిమాతోనే క్లిష్టమైన పాత్రలో పరీక్ష ఎదుర్కున్న సంజనా సంఘి, మంచి కథనాన్ని ఎంచుకుని, అంతే అందంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ఫాక్స్ స్టార్ స్టూడియో అందరికీ ఈ చిత్రం గొప్పతనానినికి సంబంధించిన క్రెడిట్ దక్కుతుంది. 


రేటింగ్: ఏ రేటింగూ దిల్ బెచారా సినిమాకు కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్మైలింగ్ ఫేస్‌కి కానీ న్యాయం చేయలేవేమో. బెచారా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..