Spyder Agnyaathavaasi Losses : స్పైడర్, అజ్ఞాతవాసి నష్టాలు.. వేరే వాళ్లు అయితే సూసైడ్ చేసుకునేవాళ్లట.. దిల్ రాజు కామెంట్స్
Agnyaathavaasi Disaster Losses పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం ఎంతటి అంచనాల నడుము రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన తరువాత ఎలాంటి ఫలితాన్ని రాబట్టింది.. ఎన్ని కోట్ల నష్టాలను తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే.
Agnyaathavaasi Disaster Losses స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంటాయి. అవి ఏ కాస్త తేడా కొట్టేసినా కోట్లలో నష్టాన్ని తెస్తాయి. అదే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలా మహేష్ బాబు స్పైడర్ సినిమా, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యాయి. కానీ అవి రెండు టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. కొన్ని కోట్ల నష్టాలను నిర్మాతలకు తెచ్చి పెట్టాయి.
అయితే తాజాగా మరోసారి ఈ రెండు సినిమాల నష్టాలు ప్రస్థావనలోకి వచ్చాయి. తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ.. స్పైడర్, అజ్ఞాతవాసి సినిమా నష్టాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ రెండు చిత్రాలను నైజాంలో తానే డిస్ట్రిబ్యూట్ చేశానని అన్నాడు. అయితే ఈ రెండు సినిమాలకు వచ్చిన నష్టాలను చూస్తే.. వేరే డిస్ట్రిబ్యూటర్‌లు అయితే సూసైడ్ చేసుకునేవారని లేదంటే అన్నీ వదిలేసి ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయేవారని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
తాను కాబట్టి అలా నిలదొక్కుకున్నానని, ఆ ఏడాది తనకు వరుసగా ఆరు సినిమాలు హిట్ అవ్వడంతో బతికిపోయానని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అలా మొత్తానికి దిల్ రాజు తన కెరీర్‌లో చూసిన అతి పెద్ద నష్టాల గురించి బయటపెట్టేశాడు. ఇక వారిసు సినిమా సూపర్ హిట్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నట్టు చెప్పేస్తున్నాడు దిల్ రాజు.
రామ్ చరణ్ శంకర్ సినిమా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే అరవై శాతం షూటింగ్ అయిందని కూడా చెప్పాడు. ఇక తాను భవిష్యత్తులో ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీలతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.
Also Read : Vallabhaneni Janardhan Passed Away: వారం వ్యవధిలో మరో విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు జనార్దన్ మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి