Thalapathy Vijay No 1 Hero కోలీవుడ్‌లో ఉండే ఫ్యానిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దళపతి విజయ్ నెంబర్ వన్ హీరో అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యల మీద అజిత్‌ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అసలే విజయ్, అజిత్‌ అభిమానుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం చెల రేగుతూనే ఉంటుంది. ఇరు హీరోల అభిమానులు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో తిట్టుకుంటూనే కనిపిస్తుంటారు. ఒకరి మీద మరొకరు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి సమయంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అజిత్‌ అభిమానులను గిల్లినట్టు అయింది. దీంతో అజిత్ అభిమానులు దిల్ రాజును ఆడుకున్నారు. దిల్ రాజు ఎప్పుడూ అంతే అని, తాను ఏ సినిమా తీస్తూ ఉంటే.. ఆ సినిమా గురించి గొప్పగా చెప్పడం.. ఏ హీరోతో పని చేస్తుంటే.. ఆ హీరోని పొగడటం పరిపాటే అని నెటిజన్లు కౌంటర్లు వేస్తూ వచ్చారు. అయితే తాజాగా విజయ్ నెంబర్ వన్ హీరో ఎందుకు అనే దానిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.


తాను కొత్త ఒరవడిని సృష్టిస్తున్నానని, తమిళ స్టార్ హీరోతో తెలుగు దర్శకుడిని కలిపానని, తమిళ స్టార్ డైరెక్టర్‌తోను తెలుగు స్టార్ హీరోను కలిపాను.. ఇదొ కొత్త ట్రెండ్ అని అన్నాడు. తన వద్ద కథ రెడీగా ఉండి, దర్శకుడు ఉంటే ఏ స్టార్ హీరోను అయినా కలుస్తాను అని ప్రాజెక్ట్ సెట్ చేస్తాను అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ అయితే కంటిన్యూగా థియేటర్ షేర్‌ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.. గత ఐదారు సినిమాలు రిజల్ట్‌తో సంబంధం లేకుండా అరవై కోట్ల షేర్ రాబట్టేశాడని, అందుకే నంబర్ వన్ హీరో అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.


రామ్ చరణ్‌ శంకర్ సినిమా దాదాపు అరవై శాతం షూటింగ్ పూర్తయిందని, వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయబోతోన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీలతో సినిమాలు చేయబోతోన్నట్టుగా దిల్ రాజు ప్రకటించాడు.


Also Read : Anchor Vindhya Vishaka : ఇన్ని కష్టాలు అనుభవిస్తోందా?.. తండ్రి గురించి తపన.. యాంకర్ వింధ్యా విశాఖ ఎమోషనల్ పోస్ట్


Also Read : Eesha Rebba Saree pics : చిలకపచ్చ కోక పెట్టినాది కేక.. చీరలో ఈషా రెబ్బా అదుర్స్.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి