Game Changer: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో గత వైసీపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని.. అల్లు అర్జున్ ను ఇండైరెక్ట్ గా ఇచ్చి పడేసాడు. ఈ వేడుక తర్వాత  తిరుగు ప్ర‌యాణంలో ఇద్దరు అభిమానులు  ప్ర‌మాద‌వశాత్తు మ‌ర‌ణించారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు  అభిమానుల‌కు మొత్తంగా రూ.10లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ‌నివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో గేమ్ చేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.  ఆ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో  కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్‌(22) అనుకోకుండా ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే నిర్మాత దిల్‌రాజు  స్పందించారు.


ఆయ‌న మాట్లాడుతూ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ విష‌యయమై మేం హ్యాపీగా ఉన్న స‌మ‌యంలో ఇలా ఇద్ద‌రు అభిమానులు తిరుగు ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో చ‌నిపోవ‌టం ఎంతో కలిచివేసిందన్నారు. వారిని తిరిగి తీసుకురాకపోయినా..  వారి కుటుంబాల‌కు నేను అండ‌గా ఉంటాను. నా వంతుగా వారి ఫ్యామిలికి  చెరో రూ.5ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను.  వారికి నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నానన్నారు. అటు జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ చెరో రూ. 5 లక్షల నష్ట పరిహారం అందించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరుపున తగిన ఆర్ధిక సాయం అందించబోతున్నట్టు తెలిపారు.




‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో రామ్ చరణ్ తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. ఐఏఎస్ అధికారిగా.. రైతుగా.. పొలిటిషియన్ గా  విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వైకుంఠ ఏకాదశి పర్వదినమైన జనవరి 10న రిలీజ్ కాబోతుంది.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.