Dil Raju Bagged Nani's Dasara Rights: నాని హీరోగా దసరా అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. నాని కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లోనే రూపొందించారు. నాని కూడా పూర్తిస్థాయిలో తెలంగాణ యాసలో మాట్లాడుతుండగా సినిమా మొత్తాన్ని సింగరేణి గనులు, గోదావరిఖని నేపథ్యంలో తెరకెక్కించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాని కూడా ఒక సింగరేణి కార్మికుడిగా కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాని నిర్మించింది సుధాకర్ చెరుకూరి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించగా మార్చి 30వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ సినిమాగా రూపొందిన ఈ సినిమా టీజర్ చూసిన అందరూ కూడా సినిమా మీద విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.


ఇక ఈ సినిమాని తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని హిందీలో అనిల్ తడానికి సంబంధించిన ఏ ఏ ఫిలిమ్స్ బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా తెలుగులో ఈ సినిమా హక్కులను చదలవాడ శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. అయితే టీజర్ చూసిన తర్వాత దిల్ రాజు ఈ సినిమాకి అదనంగా నాలుగు కోట్ల రూపాయలు చదలవాడ శ్రీనివాసరావుకు ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు నుంచి అన్ని ఏరియాల హక్కులు కొనుక్కోవడానికి అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ సినిమా పరిస్థితి టీజర్ ముందు టీజర్ తర్వాత అన్నట్టుగా మారిపోయింది అని చెప్పాలి. టీజర్ లో నానిని చూపించిన విధానం అలాగే పూర్తిస్థాయి తెలంగాణ మాస్ మసాలా మూవీగా రాబోతుందని హింట్ ఇవ్వడంతో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయని చెప్పాలి.


ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని దిల్ రాజు కొనుగోలు చేయడంతో ఈ సినిమా మీద మిగతా డిస్ట్రిబ్యూటర్ల కన్ను కూడా పడిందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే కొనుగోలు చేసిన  సినిమాకి నాలుగు కోట్ల రూపాయలు అదనంగా పెట్టి కొనడంతో దిల్ రాజు హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. 


Also Read: Pawan Kalyan Unstoppable: పవన్ ఎపిసోడ్ కోసం స్పెషల్ టీములు.. దిల్ రాజును వాడుకుంటూ ఆహా ప్రమోషన్స్!


Also Read: Bandla Ganesh Tweets: బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకు వస్తే అపాయింట్ మెంట్ కుడా ఇవ్వం..బండ్ల గణేష్ ట్వీట్ల వర్షం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.