Dil Raju Bumper Offer: అందరినీ ఏడిపించేసిన `బలగం`.. వేణుకు దిల్ రాజు బంపర్ ఆఫర్!
Dil Raju One More Offer: బలగం అనే సినిమాతో ఎవరు ఊహించని విధంగా వచ్చి హిట్టు కొట్టిన వేణు ఎల్దండికి దిల్ రాజు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
Dil Raju One More Offer to Venu: బలగం అనే సినిమాతో ఎవరు ఊహించని విధంగా వచ్చి హిట్టు కొట్టాడు వేణు ఎల్దండి. ఈ వేణు ఎల్దండి ఎవరు కాస్త కొత్తగా అనిపిస్తుంది అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదండీ మన కమెడియన్ వేణు. అలా అంటే అందరికీ అర్థం అయిపోతుంది. కమెడియన్ గా సినీ రంగంలో ప్రవేశించి అనేక సంవత్సరాలు కమెడియన్ గా కొనసాగిన ఆయన జబర్దస్త్ వేణు అని కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.
జబర్దస్త్ లో అనేక సంవత్సరాలు కమెడియన్ గా పనిచేసిన ఆయన ఎట్టకేలకు దాదాపు 5 సంవత్సరాల నుంచి అన్నింటికీ దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆయనకు ఏమైంది? ఎందుకు దూరం అయ్యారు? అందరూ అనుకుంటున్నా సమయంలోనే దిల్ రాజు ప్రొడక్షన్ పేరుతో దిల్ రాజు కుమార్తె ఒక కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించడం జరిగింది. అందులో బలగం అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించడంతోపాటు ఈ సినిమాని కమెడియన్ వేణు డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే కమెడియన్ కావడంతో ఏదైనా కామెడీ సినిమా చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ వేణు చేసిన బలగం సినిమా అందరినీ ఆకట్టుకుంది. పూర్తిస్థాయి తెలంగాణలో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ వాసులందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. మార్చి మూడవ తేదీన విడుదలైన ఈ సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు వెళుతుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా వేణు డైరెక్ట్ చేయగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
ఇక ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచిన నేపద్యంలో వేణుకి ఈసారి పెద్ద బడ్జెట్ సినిమా డైరెక్టర్ చేసే అవకాశం దిల్ రాజు కల్పించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా కథను దొంగిలించారు అంటూ గడ్డం సతీష్ అనే ఒక జర్నలిస్ట్ కం రచయిత వేణు మీద, దిల్ రాజు మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయినా సరే వేణు పనితనం మీద నమ్మకం ఉన్న దిల్ రాజు వేణుకి ఒక బడా ప్రాజెక్టు డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Andrea Jeremiah Naked: నగ్నంగా మారి వుమెన్స్ డే విషెస్ చెప్పిన ఆండ్రియా.. వైరల్ గా ఫోటో!
Also Read: Power Star Pawan Attacked: లైవ్లో పవర్ స్టార్ పవన్ మీద దాడి.. తీవ్రంగా ఫైర్ అయిన హీరో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి