Venkatesh76: వెంకటేష్ కోసం చిరంజీవిని పక్కనపెట్టిన దిల్ రాజు ..వెంకీ76 ప్రాజెక్ట్ వెనుక అసలు కథ…!
![Venkatesh76: వెంకటేష్ కోసం చిరంజీవిని పక్కనపెట్టిన దిల్ రాజు ..వెంకీ76 ప్రాజెక్ట్ వెనుక అసలు కథ…! Venkatesh76: వెంకటేష్ కోసం చిరంజీవిని పక్కనపెట్టిన దిల్ రాజు ..వెంకీ76 ప్రాజెక్ట్ వెనుక అసలు కథ…!](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2024/02/03/294563-venkatesh-dilraj-zee.jpg?itok=f6O-Rqwx)
Venkatesh::ఈ ఏడాది సంక్రాంతి బరిలో సైంధవ్ చిత్రంతో దిగాడు విక్టరీ వెంకటేష్. ఇది అతని కెరీర్లో 75వ చిత్రం. ఊహించిన ఫలితాన్ని అందించక పోయిన వెంకటేష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ వెంకీ మామ మాత్రం ఆ ఒక్క డైరెక్టర్ తోనే చేయడానికి ఇష్టపడుతున్నాడు.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Chiranjeevi: ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన హీరో విక్టరీ వెంకటేష్. అతని కెరీర్ లో చేసిన 75 చిత్రాలలో ఇంకా ఏ హీరో కవర్ చేయనన్ని జోనర్లు కవర్ చేసేసాడు. ఎమోషన్ దగ్గర నుంచి యాక్షన్ వరకు.. స్పై థ్రిల్లర్ దగ్గర నుంచి డివోషన్ వరకు.. వెంకీ మామ అన్ని రకాల కథల్లో నటించాడు. రీసెంట్ గా సంక్రాంతికి సైంధవ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా సక్సెస్ సాధించకపోయినా ఇందులో వెంకీ మామ యాంగ్రీ యాక్షన్ మోడ్ అందరిని ఆకట్టుకుంది. ఇక వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనండి వెంకీ 76 చేయడానికి తరుణ్ భాస్కర్ లాంటి ఎందరో డైరెక్టర్స్ సిద్ధంగా ఉన్నారు.
కానీ వెంకీ మామ మాత్రం ఆ డైరెక్టర్ తోటే చేయాలి అని ఫిక్స్ అయ్యాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు వెంకటేష్ తో ఎఫ్2 ..ఎఫ్3 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన అనిల్ రావిపూడి. వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా ఆల్రెడీ సెట్ అయిందట. ఈ చిత్రానికి ప్రొడక్షన్ బాధ్యతలు దిల్ రాజ్ వహిస్తున్నారు. కామెడీ కంటెంట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అనిల్ రావిపూడి.. బాలయ్య తో భగవంత్ కేసరి మూవీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ నేపథ్యంలో అనిల్ నెక్స్ట్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో మూవీ అంటే.. స్టోరీ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిజానికి వెంకీతో చేయబోయే ఈ స్టోరీ మొదట అనిల్, దిల్ రాజ్ మెగాస్టార్కు వినిపించారట. అనిల్ డైరెక్షన్ పై గురి ఉన్నప్పటికీ స్టోరీ పరంగా చిరు ఆసక్తి చూపలేదట. పైగా ఆల్రెడీ విశ్వంభరా చేస్తూ ఉండడంతో మెగాస్టార్ మెగా బిజీగా ఉన్నారు. అందుకే ఈ ఇద్దరి కాంబోలో మూవీ ప్రస్తుతానికి సెట్ కాలేదు. అలా చిరు నో చెప్పిన స్టోరీకి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇద్దరి కాంబోలో మూవీ ఫిక్స్ అయ్యింది. మరి ఈ ఇద్దరి కాంబోలో రాబోయే నెక్స్ట్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!
Also read: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook