Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..

Kumari Aunty Food Point: కుమారి ఆంటీ నిర్వహిస్తున్న ఫుడ్ పాయింట్ వల్ల ట్రాఫీక్ జామ్ అవుతోందని పోలీసులు స్టాల్ ను అక్కడి నుంచి తొలగించాలని ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమెకు మద్ధతు తెలిపేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆమెకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కుమారి ఆంటీకి మద్ధతు తెలిపారు. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 31, 2024, 02:17 PM IST
Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..

Kumari Aunty Food Point: సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులరైన కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ పాయింట్ వల్ల ట్రాఫీక్ జామ్ అవుతోందని పోలీసులు స్టాల్ ను అక్కడి నుంచి తొలగించాలని కుమారి ఆంటీపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆమెకు మద్ధతు తెలిపేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆమెకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కుమారి ఆంటీకి మద్ధతు తెలిపారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కుమారీ ఆంటీ ఫుడ్ పాయింట్ కు మళ్లీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 

సోషల్ మీడియాలో అత్యంత తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించిన కుమారి ఆంటీ. తన ఫుడ్ పాయింట్ లో రుచికరమైన ఫుడ్ ను అందిస్తూ ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు యూట్యూట్ ఛానళ్లు ఈమె ఇంటర్వ్యూ తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సెలబ్రిటీలు సైతం కుమారీ ఆంటీ ఫుడ్ పాయింట్ ను సందర్శించడానికి ఆసక్తి చూపారు. దీంతో ఆ ఏరియాలో జనసందోహం పెరిగిపోయింది. 

అంతేకాదు, సోషల్ మీడియాలో కుమారి ఆంటీ క్రేజ్ మరింత పెరగడంతో కస్టమర్ల తాకిడి కూడా బాగా పెరిగిపోయింది. అయితే ఆమె నిర్వహిస్తోన్న ఫుడ్ పాయింట్ కేబుల్ బ్రిడ్జీ పరిసర ప్రాంతానికి అతి దగ్గర్లో ఉంది.  ఆ దారిగుండా ట్రాఫిక్ జామ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. 

దీంతో పోలీసులు రోడ్డుపై ఫుడ్ బిజినెస్ చేయకూడదు. సరైన పార్కింగ్ సౌకర్యాలు లేవని, దీనివల్ల భారీ ట్రాఫిక్ జామ్ అవుతుందని మంగళవారం స్టాల్ ను అక్కడి నుంచి తరలించాలని కుమారి ఆంటీపై కేసు నమోదుచేశారు. దీంతో రోజూ కూలీ చేసుకునే మాకు పొట్ట మీద కొట్టడం సరైంది కాదని తమకు దారి చూపమని ఆమె కోరారు. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటే సామాన్యులకు అండగా నిలిచే ప్రభుత్వం అని ఆమె ఫుడ్ పాయింట్ అక్కడే నిర్వహించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు, త్వరలో తను కూడా కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ ను సందర్శిస్తానని సీఎం రేవంత్ చెప్పారు.  ఇదిలా ఉండగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తరలింపుపై నిన్న వైసీపీ, జనసేన పార్టీలు సోషల్ మీడియా వేదికగా విమర్శించుకున్నసంగతి కూడా తెలిసిందే.

 ఇదీ చదవండి: Side Effect of Paper Cup: మీరూ పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

 ఇదీ చదవండి:  Home Cleaning Tips: రూ.2 కాఫీ సాచెట్ మీ ఇంటికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News