Dil raju To Face Problems with Varasudu: టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా చెప్పుకునే దిల్ రాజు ఇప్పుడు కొత్త సమస్యతో ఇబ్బందుల్లో ఉన్నారని తెలుస్తోంది. ఆయన ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే దిల్ రాజుకు సినిమాల విషయంలో తన వ్యాపారం తరవాతే ఏదైనా, ఆయన ఎక్కువగా తన వ్యాపార సంబంధాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. అయితే గతంలో ఆయన ఒక వివాదంలో చిక్కుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది క్రాక్ సినిమా విడుదల సమయంలో తమిళ హీరో విజయ్ మాస్టర్ సినిమాని దిల్ రాజు కొనుగోలు చేసి విడుదల చేశారు. అయితే క్రాక్ సినిమా కంటే ఈ మాస్టర్ సినిమాకి ఎక్కువ థియేటర్లు వచ్చేలా చేయడంలో దిల్ రాజు హస్తం ఉందని అప్పట్లో క్రాక్ సినిమా కొనుక్కున్న వరంగల్ శ్రీను ఆరోపణలు గుప్పించారు. ఇదే విషయం గురించి ఒకానొక సమయంలో దిల్ రోజు స్పందించారు. డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇచ్చి ఎందుకు విడుదల చేస్తున్నారు అంటే వాటికి మార్కెట్ ఉంది కాబట్టి విడుదల చేస్తున్నామని, మార్కెట్ లేకుంటే చేయం కదా అని ప్రశ్నించారు.


అలాగే మరో సందర్భంలో స్ట్రైట్ సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ సినిమాలు ఆపినా ఇబ్బంది లేదని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో దిల్ రాజుకు తలనొప్పి ఏర్పడే అవకాసం కనిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే దిల్ రాజు విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వారసుడు అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు  ప్రకటించగా ఆ తరువాత తాము కూడా సంక్రాంతికి వస్తున్నామని వారసుడు టీం ప్రకటించింది.


ఇక ఈ సినిమా బైలింగ్యువల్ అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ సినిమా తమిళ్ సినిమా అని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నామని సినిమా హీరో, డైరెక్టర్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అందుకే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన షూటింగ్స్ నిలిచిపోయినప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ తమిళ సినిమా పేరుతో జరుపుకున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల నేపధ్యంలో సినిమాని మరోసారి ధియేటర్లకు తీసుకురావడం అనేది చాలా కష్టతరమైన విషయమే.


 ఎందుకంటే ఒక పక్కన నందమూరి బాలకృష్ణ, మరొక పక్కన చిరంజీవి, ఇంకొక పక్క ప్రభాస్ లాంటి బడా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు విజయ్ సినిమా కోసం థియేటర్లను బ్లాక్ చేయడం అనేది చాలా కష్టమైన పని. దిల్ రాజు హ్యాండ్ ఓవర్ లో ఉన్నది థియేటర్లను మేనేజ్ చేయగలరేమో కానీ తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా మిగతా థియేటర్లో యజమానులు ఎవరూ ముగ్గురు తెలుగు టాప్ హీరోల సినిమాలు తీసుకోకుండా విజయ్ సినిమా తీసుకోవడానికి  ఆసక్తి చూపించరు. మరి దిల్ రాజు ఇప్పుడు వెనక్కి తగ్గుతారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Also Read: Rishab Shetty Meets Rajinikanth : కాంతారాపై సూపర్ స్టార్ ప్రశంసలు.. తలైవా కాళ్లు మొక్కిన రిషభ్ శెట్టి


Also Read: Poonam Kaur: రాహుల్ పప్పు కాదు.. భేటీ అనంతరం పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook