Poonam Kaur: రాహుల్ పప్పు కాదు.. భేటీ అనంతరం పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Poonam Kaur Met Rahul Gandhi: రాహుల్ గాంధీ తలపెట్టిన భారతదేశవ్యాప్త భారత జోడో యాత్ర తెలంగాణలో ఎంటర్ అయిన క్రమంలో రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్  కలిసి పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 29, 2022, 10:48 AM IST
Poonam Kaur: రాహుల్ పప్పు కాదు.. భేటీ అనంతరం పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Poonam Kaur Met Rahul Gandhi: ప్రస్తుతం రాహుల్ గాంధీ తలపెట్టిన భారతదేశవ్యాప్త భారత జోడో యాత్ర తెలంగాణలో ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 52వ రోజు ఈ యాత్ర కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్  కలిసి పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన పూనం కౌర్  ఎప్పటికప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో కలకలం రేపుతూ ఉంటుంది.  

ఒకప్పుడు హీరోయిన్ గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన పూనం కౌర్  ఆ సినిమాలు ఆడక పోవడంతో సినిమాలకు కాస్త దూరమైంది. ఇటీవల నాతిచరామి అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ప్రస్తుతం ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని రెండు మూడు సినిమాలు చేశారు. ఇక మరోపక్క ఆమె ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా పూనం కౌర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పూనం కౌర్ తో మాట్లాడుతూ ఖాదీ వస్త్రాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందని గాంధీజీ ధరించిన వస్త్రాలు కూడా చేనేత వస్త్రాలే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూనం కౌర్ నేతల కోసం కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయాలని కోరగా కచ్చితంగా చేస్తుందని, మా అమ్మ కూడా చేనేతలను వేసిన చీరే కడుతుందని రాహుల్ గాంధీ పేర్కొనడమే గాక మీరు మా అమ్మను చెల్లిని ఒకసారి కచ్చితంగా కలవండని కూడా కోరినట్లు తెలుస్తోంది.

అంతేకాక సోనియాగాంధీని కల్పించే బాధ్యతను అప్పటికప్పుడే రాహుల్ గాంధీ పార్టీ నాయకులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై స్పందించిన పూనం కౌర్  రాహుల్ గాంధీతో 15 నిమిషాల్లో మాట్లాడానని చేనేత కార్మికులు, మహిళా సమస్యలపై చర్చించానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పప్పు కాదు సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వినతిపత్రాలు ఇవ్వగానే అవి చదివిన తరువాత మనతో మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

త్వరలోనే తన తల్లిని చెల్లిని కలవాలని రాహుల్ గాంధీ కోరారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీ తగ్గించాలని కోరిన ఆమె తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని సమస్యల మీద మాత్రం పోరాటం చేస్తానని పేర్కొన్నారు.  మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పద్మశాలీలు ఆలోచించి ఓటెయ్యాలని కోరిన ఆమె మునుగోడులో చేనేతల మంచి కోసం పనిచేసే వారికి ఓటేయాలని కోరారు. అధికార పార్టీ చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేయాలని కోరిన ఆమె చేనేత సమస్యలపై రాహుల్ గాంధీని పార్లమెంట్ లో కూడా మాట్లాడమని కోరినట్లు వెల్లడించారు.

Also Read: Rishab Shetty Touches Rajinikanth Feet : కాంతారాపై సూపర్ స్టార్ ప్రశంసలు.. తలైవా కాళ్లు మొక్కిన రిషభ్ శెట్టి

Also Read: Anasuya Bharadwaj Food : నేను బాగా తింటున్నా.. కొవ్వు పెరుగుతోంది కానీ.. అనసూయ కామెంట్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News