Dil Raju Wife Gave Birth to a Baby Boy: సినీ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే విజయవంతమైన నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. చేసిన మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా మారిపోయారు. అయితే దిల్ రాజు ప్రస్తుతం ఆనందంలో మునిగి పోయినట్లు తెలుస్తోంది. దానికి కారణం ఆయన రెండో భార్య పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడమే. నిజానికి దిల్ రాజు అనిత అనే ఆవిడని తొలుత వివాహం చేసుకున్నారు వీరికి హర్షితా రెడ్డి అనే కుమార్తె జన్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హన్షిత రెడ్డి పెరిగి పెద్దయి ఆమెకు వివాహం కూడా చేసిన తర్వాత  అనిత అకాల మరణం చెందారు. కొన్నాళ్ళ పాటు ఒంటరి జీవితం గడిపిన దిల్ రాజు తన కుమార్తె ఇతర కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో 2020 కరోనా సమయంలో తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె తన పేరును వైగా రెడ్డిగా మార్చుకున్నారు. తర్వాత దిల్ రోజు ప్రొడక్షన్స్ లో సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడంతో పాటు స్టోరీ సిట్టింగ్స్ లో కూడా ఆమె అప్పట్లో ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు వచ్చాయి.


ఆ మధ్య ఒక ఈవెంట్ కు వచ్చిన సమయంలో ఆమె గర్భవతి అయ్యే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి కానీ దాని మీద దిల్ రాజు కానీ దిల్ రాజు కుటుంబ సభ్యులు గానీ స్పందించలేదు.  అయితే అనూహ్యంగా బుధవారం తెల్లవారుజామున వైగా రెడ్డి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది. దీంతో దిల్ రాజు దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది. పలువురు ప్రముఖులు కూడా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.


బండ్ల గణేష్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. దిల్ రాజు అన్న నీకు శుభాకాంక్షలు.. మగబిడ్డ జన్మించారు అంటూ ట్వీట్ చేశాడు. ఈ శుభవార్తని దిల్ రాజు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా దిల్ రాజు ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన చేసిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్దమవుతూ ఉండగా మరో పక్క శంకర్, రాంచరణ్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి, విజయ్ కాంబోలో ఓ క్రేజీ మూవీని కూడా ఆయన లైన్లో పెట్టారు. 
Also Read: Hemachandra - Sravana Bhargavi Divorce: ఎట్టకేలకు నోరు విప్పిన హేమచంద్ర-శ్రావణ భార్గవి.. అనుమానం పెంచారుగా!


Also Read: Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి