Ram Gopal Varma: డేంజరస్ మూవీతో వస్తున్న ఆర్జీవీ.. ట్రైలర్ రిలీజ్
RGV Dangerous Trailer OUT: రామ్ గోపాల్ వర్మ మరో డిఫరెంట్ జోనర్ ఎంచుకున్నాడు. ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. డేంజరస్ ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు.
RGV Dangerous Trailer OUT: కాంట్రవర్సీ కింగ్, ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్జీవీ స్వీయ నిర్మాణ దర్వకత్వంలో రూపొందించిన లేటెస్ట్ మూవీ "డేంజరస్". దీనికి "మా ఇష్టం" అన్నది ఉపశీర్షిక. నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్లుగా యాక్ట్ చేయగా.. రాజ్ పాల్ యాదవ్, మిథున్ పురంధర్ ముఖ్యపాత్రలు పోషించారు.
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించగా.. శనివారం హైదరాబాద్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు ఆర్జీవీ. మూడు భాషలలో డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకుస్తున్నట్లు ప్రకటించారు. "నా సినిమాలలో మరో కొత్త కోణం ఈ సినిమా. హీరో, హీరోయిన్లతో వేలాది సినిమాలు వచ్చాయి. దానికి భిన్నంగా ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ కథతో దీనిని మలిచాం. మగవాళ్ళతో వారిద్దరు ఎలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారన్న నేపథ్యంలో రొమాంటిక్, క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో సాగే సినిమా ఇది. హీరోల డేట్స్ దొరక్కపోయినా హీరోయిన్స్‌తో కూడా సినిమాలు చేయవచ్చని చెప్పేవిధంగా ఈ సినిమా ఉంటుంది" అని ఆయన అన్నారు.
గతంలో తాను తీసిన సినిమాల రీ రిలీజ్ గురించి అడిగిన ప్రశ్నకు వర్మ బదులిస్తూ.. కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, అందుకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతోందని చెప్పారు. ఫ్యామిలీస్ ఈ సినిమాను చూడరేమోనన్న అభిప్రాయాన్ని ఓ పాత్రికేయుడు వ్యక్తం చేయగా.. ఫ్యామిలీస్ అంతా కలసి చూడకపోయినా ఒక్కొక్కరు వేరు వేరుగా చూస్తారని ఆర్జీవీ బదులిచ్చారు.
ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. కొన్ని కారణాలతో ఈ సినిమా రిలీజ్‌ను తాను అడ్డుకున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మకు తనకు మధ్య వివాదాలు అన్నీ తొలగిపోవడంతో ఇకపై ఇద్దరం కలసి సినిమాలు రిలీజ్ చేయదలచుకున్నామని తెలిపారు. రొమాన్స్ మాత్రమే కాదని, మంచి కంటెంట్‌తో ఆసక్తిదాయకంగా డేంజరస్ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ.బి.శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం ఆనంద్ అందించగా.. మల్హర్ భట్ జోషి కెమెరామెన్‌గా వర్క్ చేశాడు.
Also Read: PM Kisan: పీఎం కిసాన్ యోజన పథకం లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. ఆ రోజే లాస్ట్..!
Also Read: Bandi Sanjay: మా ఎండింగ్ భయంకరంగా ఉంటుంది.. కేసీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook