Director Anil Ravipudi huge praise on RRR Hero Ram Charan at Rowdy Boys Musical Event: ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) మేనల్లుడు ఆశిష్ (Ashish) టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) చిత్రాన్ని నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రంను శుక్రవారం (జనవరి 14న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి బుధవారం మ్యూజికల్ నైట్ ఈవెంట్‌ (Rowdy Boys Musical Event)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'రౌడీ బాయ్స్' సినిమా మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అన్ని బాగుండి ఉంటే.. ఇప్పటికి థియేటర్లలో విజిల్స్ వేసే వాళ్లం. నిజంగా చెప్పాలంటే.. మన టాలీవుడ్ హీరోలు బంగారం. మన రామ్ చరణ్ (Ram Charan) ఇంకా మంచి బంగారం. మనోళ్లు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోలే. ఏ కష్టం వచ్చినా ముందుంటారు మన తెలుగు హీరోలు. ఒక మంచి వ్యక్తిత్వం బాగా నటిస్తేనే రాదు.. మంచి మనసు ఉంటేనే అది సాధ్యం' అని అనిల్ అన్నారు. 


Also Read: Malaika Arora - Arjun Kapoor: మరో స్టార్ కపుల్ బ్రేకప్.. షాకింగ్ కౌంటర్ ఇచ్చిన హీరో!!


'సందర్భం వచ్చింది కాబట్టి కాబట్టి చెప్తున్నా.. రాజమౌళి కొడుకు పెళ్లిలో రామ్ చరణ్ సర్‌ను మొదటిసారి కలిసాను. ఇతడే అనిల్ అని అక్కడివారు పరిచయం చేస్తే.. ఎఫ్ 2 డైరెక్టర్ కదా అన్నారు. ఆ తరువాత నా సినిమాకే పోటీనా? చరణ్ అనగానే నాకు చెమటలు పట్టేశాయి. ఆ వెంటనే హగ్ చేసుకుని నీ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నా అని చెప్పారు. దాంతో ఊరిపీల్చుకున్నా. చరణ్ సర్‌ ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడం నచ్చింది. ఆయన మంచి బంగారం' అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశంసించారు. ఎఫ్ 2, వినయ విధేయ రామ చిత్రాలు 2019లో ఒకసారి విడుదలయ్యాయి. 


గత శనివారం 'రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆవిష్కరించారు. ట్రైలర్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఎన్టీఆర్.. ట్రైలర్ చూస్తుంటే హిట్ ఖాయమనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాలేజి నేపథ్యంలో యూత్ ఫుల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఏందిరా ఇది.. రోజురోజుకు ఇంతింత విచిత్రంగా తయారౌవున్నావేంట్రా', 'ఎక్కడైనా రాసుందా.. పెద్దమ్మాయిలను ప్రేమించొద్దని', 'అన్నా మెడికల్ కాలేజ్ అమ్మాయిని డేట్‌కి తీసుకురావచ్చా', 'మా కాలేజ్ అమ్మాయిల జోలికి రాకండి' అనే డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. 


Also Read: Jasprit Bumrah vs Marco Jansen: మార్కో.. బుమ్రా అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. ఫైరూ! తగ్గేదేలే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి