Jasprit Bumrah vs Marco Jansen: మార్కో.. బుమ్రా అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. ఫైరూ! తగ్గేదేలే!! (Video)

మార్కో జాన్సెన్‌ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుమ్రా సంబరాలు చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 12:23 PM IST
  • ప్రత్యర్దులపైకి దూసుకెళుతున్న బుమ్రా
  • జాన్సెన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన బుమ్రా
  • బుమ్రా అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. ఫైరూ
Jasprit Bumrah vs Marco Jansen: మార్కో.. బుమ్రా అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. ఫైరూ! తగ్గేదేలే!! (Video)

 Jasprit Bumrah Reaction goes viral After Dismissing Marco Jansen: సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), కపిల్ దేవ్ (Kapil Dev) హయాంలో శాంతంగా ఉండే టీమిండియా ఆటగాళ్లు.. సౌరవ్ గంగూలీ (Sourav Gangly) వచ్చిన అనంతరం కాస్త దూకుడు పెంచారు. దాదా శిష్యులు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్ ప్రత్యర్థులకు తమదైన శైలిలో సమాధానం ఇచ్చేవారు.

ఇక విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత భారత జట్టులోని దాదాపుగా ప్రతిఒక్కరు సై అంటే సై అంటున్నారు. తమని ప్రత్యర్థి ఎవరైనా కవ్విస్తే.. గొడవకు దిగుతున్నారు. ఇటీవల కాలంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తగ్గేదేలే అంటూ ప్రత్యర్దులపైకి దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలోనే కేప్‌టౌన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 

విషయంలోకి వెళితే.. జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా ముగిసిన రెండో టెస్టులో జస్ప్రీత్ బమ్రా, మార్కో జాన్సెన్‌ (Jasprit Bumrah vs Marco Jansen) మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో బుమ్రాకు జాన్సెన్‌ వరుస బౌన్సర్లు సంధించాడు. ఎంతో ఓపికతో ఉన్న బుమ్రాను జాన్సెన్‌ తన మాటలతో కూడా కవ్వించాడు. దీంతో బుమ్రా కూడా ధీటుగా బదులిస్తూ జాన్సెన్‌ మీదకు దూసుకొచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ అక్కడితో ఆగిపోయింది. అయితే ఈ గొడవను జాన్సెన్‌ మరిచిపోయాడేమో కానీ.. బుమ్రా మాత్రం మనసులోనే ఉంచుకున్నాడు.

Also Read: IND vs SA: సింపుల్ క్యాచ్‌ మిస్‌ చేసిన పుజారా.. టీమిండియాకు ఐదు పరుగుల పెనాల్టీ!!

కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మార్కో జాన్సెన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా తన పవరేంటో చూపించాడు. రెండో రోజైన బుధవారం టీ విరామం అనంతరం బుమ్రా వేసిన ఓవర్‌లో జాన్సెన్‌ను బౌన్సర్లతో భయపెట్టాడు. ఓ  సూపర్‌ డెలివరీకి జాన్సెన్‌ షాక్ అయ్యాడు. షార్ట్‌ పిచ్‌ అయిన బంతి నేరుగా ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేయడంతో.. జాన్సెన్‌ కనీసం బుమ్రా వైపు కూడా చూడకుండా పెవిలియన్ చేరాడు.

జాన్సెన్‌ ఔట్ అవ్వడంతో టీమిండియా పేసర్ తనదైన శైలిలో సంబరాలు (Bumrah Reaction) చేసుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బుమ్రాకు జతకలిశాడు. 

మార్కో జాన్సెన్‌ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుమ్రా సంబరాలు (Bumrah Celebrations) చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 'బుమ్రా అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. ఫైరూ' అని ఒకరు కామెంట్ చేయగా.. 'బుమ్రా తగ్గేదేలే' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో బూమ్ బూమ్ ఐదు వికెట్లు సాధించాడు. కేప్‌టౌన్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో టీమిండియా బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు హర్భజన్‌ సింగ్‌ 2010-11లో 7 వికెట్లు తీయగా.. అదే మ్యాచ్‌లో ఎస్ శ్రీశాంత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 

Also Read: Sarkaru Vaari Paata Postponed: మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మరోసారి వాయిదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News