Director Atlee wife Priya Preganancy కోలీవుడ్ టాప్ డైరెక్టర్‌ల జాబితాలోకి అట్లీ చేరిపోయాడు. రాజారాణి సినిమాతో తనలోని సెన్సిబిలిటీస్‌ను చూపించాడు అట్లీ. ఆ తరువాత అదిరింది, విజిల్ వంటి సినిమాలతో కమర్షియల్‌ యాంగిల్‌నూ చూపించాడు. దళపతి విజయ్‌తో తీసిన రెండు సినిమాలు కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్ షా అట్లీతో సినిమా తీస్తున్నాడు. జవాన్ అంటూ ఈ సినిమాలో షారుఖ్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే బాలీవుడ్‌లో అట్లీ ఎంట్రీ ఇవ్వకముందే అతనికి ఓ శుభవార్త వచ్చింది. అట్లీ తండ్రి కాబోతోన్నాడు. ప్రస్తుతం అట్లీ గాల్లో తేలిపోతోన్నట్టుగా కనిపిస్తోంది. అట్లీ భార్య ప్రియా ఈ విషయాన్ని చెబుతూ పోస్ట్ వేసింది. తాము పేరెంట్స్‌మి కాబోతోన్నట్టుగా చెబుతూ అందరినీ ఆశీర్వాదాన్ని కోరింది. మొత్తానికి డైరెక్టర్ అట్లీ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సరోగసి అంటారేమో అని ముందు జాగ్రత్తగా.. అందరికీ తన గర్భాన్ని చూపించేసింది.


 



ఇక త్వరలోనే బేబీ బంప్ ఫోటో షూట్ కూడా చేయించుకుంటుందేమో. అసలే ఇప్పుడు అంతా కూడా సరోగసి ట్రెండ్ నడుస్తోంది. నయన్ విఘ్నేష్‌ల సరోగసి తరువాత ఇది మరింతగా చర్చలోకి వస్తోంది. ఇప్పుడు ఉపాసన కూడా ఇలానే సరోగసి చేయించుకుంటోందంటూ గాసిప్స్ వస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజం ఉందన్నది మెగా ఫ్యామిలీకే తెలియాలి.


అట్లీ భార్య ప్రియాది తెలుగే. ఆమె తల్లిదండ్రులు తెలుగు వాళ్లే. కానీ అట్లీతో ప్రేమలో పడ్డ ప్రియ.. మొత్తానికి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. ఈ జంట మీద ఎన్ని ట్రోలింగ్స్, మీమ్స్ పడుతుంటాయో అందరికీ తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ జోడి అంటూ జనాలు ఈ జంటను ట్రోల్ చేస్తుంటుంది.


Also Read : Upasana Surrogacy : సరోగసి ద్వారా బిడ్డను కంటోన్న ఉపాసన.. అసలు మ్యాటర్ ఇదా?


Also Read : ED Notice to Rakul Preet : డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్‌కు ఈడీ నోటీసులు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook