ED Notice to Rakul Preet : డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్‌కు ఈడీ నోటీసులు

Rakul Preet Singh in Drugs Case గతేడాది బెంగళూరు, ముంబై, హైద్రాబాద్‌లో డ్రగ్స్ కేసు ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఎంతో స్టార్ హీరోలు, ఫ్యామిలీ మెంబర్లకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 02:20 PM IST
  • మళ్లీ డ్రగ్స్ కేసులో కదలికలు
  • సెలెబ్రిటీలకు తప్పని తిప్పలు
  • రకుల్ ప్రీత్‌కు ఈడీ నోటీసులు
ED Notice to Rakul Preet : డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్‌కు ఈడీ నోటీసులు

ED Notice to Rakul Preet టాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని భాషల ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలకు డ్రగ్స్ కేసులు సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని ఈ మేరకు ఈడీ కూడా విచారించింది. ఇక శాండల్ వుడ్‌లో అయితే సంజనా గల్రానీని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అదే టాలీవుడ్‌లో అయితే ఎంతో మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎంతో మందిని విచారించింది.

గత ఏడాది రానా, రకుల్ వంటి వారిని ఈడీ విచారించింది. రకుల్ అయితే కొండ పొలం షూటింగ్‌లో ఉండగానే ఈ డ్రగ్స్ కేసు వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే రకుల్‌ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెబుతూ వచ్చింది. కావాలనే మీడియాలో ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు మరోసారి రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

గత ఏడాది బెంగళూరులో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నైజీరియన్ అరెస్టుతో లింకులన్నీ కూడా బయటపడ్డాయి. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన నిర్మాత శంకరగౌడను పోలీసులు విచారించారు. ఇక ఈ కేసులో సినీ, రాజకీయ ప్రముఖుల హస్తం కూడా ఉందన్న సంగతి తెలిసిందే. మొత్తానికి మరోసారి ఈడీ అందరి మీద కన్నేసినట్టు కనిపిస్తోంది.

ఇక గత ఏడాది అయితే దీపిక పదుకొణె పేరు కూడా బయటకు వచ్చింది. డీ, ఎన్ వంటి కోడ్‌లతోనే ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఈడీ తెలిసింది. ఇక ఇందులో డీ అంటే దీపికా పదుకొణె అని, ఎన్ అంటే మహేష్‌ బాబు భార్య నమ్రత కూడా అని కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి ఈ డ్రగ్స్ మరోసారి సంచలనం కాబోతోన్నట్టుగా తెలుస్తోంది

Also Read : Varisu Thetre Issue : దళపతి విజయ్ నెం.1 హీరోనట.. అజిత్ అభిమానులను గెలికిన దిల్ రాజు

Also Read : Shilpa Reddy Bikini : బికినిలో సామ్రాట్ అక్క.. అందాల ఆరబోతలో టాప్ లేపేస్తోన్న శిల్పా రెడ్డి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News