స్వర్గీయ నందమూరి తారక రామారావు రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ఎన్టీఆర్ సినిమా నుంచి దర్శకుడు తేజ పక్కకు తప్పుకున్న తర్వాత ఆ సినిమాను నటుడు బాలకృష్ణనే డైరెక్ట్ చేయనున్నట్టు టాలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే, మహానటి సావిత్రి బయోపిక్ రిలీజైన తర్వాత ఆ చిత్రానికి వచ్చిన భారీ స్పందన చూశాకా బాలయ్య బాబు తన ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే అంత ఆషామాషీ విషయం కాదని భావించిన బాలయ్య బాబు.. ఆ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను దర్శకుడు క్రిష్‌కి అప్పగించినట్టు సమాచారం. బాలయ్య బాబుతో గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన క్రిష్ సైతం వెంటనే ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు టాక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్‌లో మణికర్ణిక అనే చిత్రంతో బిజీగా వున్నాడు. వీర నారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా పనులు పూర్తయ్యాకా క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్‌పైకి వచ్చే అవకాశం వుందనే టాక్ వినిపిస్తోంది.