Ranga Marthanda : చిరు నోట రంగమార్తాండ కవితాఝరి.. అప్డేట్ ఇచ్చిన కృష్ణవంశీ
Chiranjeevi Voice Over To Ranga Marthanda చిరంజీవి తన వాయిస్‌కు కొన్ని ప్రత్యేకమైన సినిమాలకు అందిస్తుంటాడు. ఇప్పుడు కృష్ణవంశీ రంగమార్తాండకు చిరు ఇచ్చిన వాయిస్ ఓవర్ అప్డేట్ వచ్చింది.
Krishna vamsi Ranga Marthanda దర్శకుడిగా కృష్ణవంశీ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సంప్రదాయాలు, ఆచారాలు ఎలా ఉంటాయి.. కుటుంబాల మధ్య బంధాలు, అనుబంధాలు ఎలా ఉంటాయి.. తెలుగమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది.. ఇలా ఏ విషయం తెలుసుకోవాలన్నా కూడా ఆయన సినిమాలు చూడాల్సిందే. ఇప్పుడంటే కృష్ణవంశీ ఫాం కోల్పోయాడని అంతా అంటారు. కానీ ఒకప్పుడు గులాబీ, సింధూరం, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, మురారి వంటి క్లాసిక్ సినిమాలను తీశాడు.
గత కొన్నేళ్లుగా కృష్ణవంశీ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడటం లేదు. చివరగా ఆయన నక్షత్రం అనే డిజాస్టర్ సినిమాను తీశాడు. అయితే ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వాలని తీయమని, మంచి సినిమా తీయాలనే తీస్తామనే వేదాంతాన్ని చెబుతుంటాడు కృష్ణవంశీ. ఐదేళ్ల నుంచి తన నుంచి ఒక్క సినిమా కూడా ఇంత వరకు రాలేదు. మళ్లీ తన సత్తా ఏంటో చాటేందుకు ఓ మరాఠీ సినిమాను ఎంచుకున్నాడు. నాన పటేకర్ నటించిన మరాఠీ సినిమా నట సామ్రాట్‌ను తెలుగులో రంగమార్తాండ అని తీస్తున్నాడు.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ ఇలా ఎంతో మంది ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి తన వాయిస్‌ను ఇచ్చాడు. ఈ మేరకు గతంలోనే ఓ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు కృష్ణవంశీ. ఇప్పుడు అ వాయిస్ ఓవర్ ఏంటి.. చిరంజీవి చెప్పిన మాటలు ఏంటి? అనే దాని మీద ఓ క్లారిటీ వచ్చింది.
తాజాగా కృష్ణవంశీ ఓ పోస్ట్ వేశాడు. మీరు ఇంత కాలం చూస్తున్న ఎదురుచూపులకు తగ్గట్టుగా అప్డేట్ వచ్చింది.. అన్నయ్య చెప్పిన షయరీ ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది.. నట మార్తాండ పద్మభూషణ్ మెగాస్టార్ డా చిరంజీవి గళ మాధుర్యంలో ధ్వనించిన రంగమార్తాండ కవితాఝరి అంటూ అప్డేట్ ఇచ్చాడు. ఇది డిసెంబర్ 21న ఉదయం 11:07 గంటలకు రాబోతోన్నట్టుగా ప్రకటించారు. మరి చిరు చెప్పిన ఆ కవితలు ఏంటో చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Narappa Collections : నారప్ప.. ఏందప్పా ఇది.. వెంకీమామ స్టామినా ఇంతేనా?
Also Read : Bigg Boss Samrat : కొత్త ఇంట్లోకి భార్యతో అడుగుపెట్టిన బిగ్ బాస్ సామ్రాట్.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook