Director Sukumar: సినీ పరిశ్రమలో ఎంతఎత్తుకు ఎదిగినా ఏదో ఒక సమయంలో పరాభవాలు ఎదురయ్యే ఉంటాయి. లెక్కల మాస్టారిగా, పుష్పతో మరోసారి దుమ్మురేపిన దర్శకుడిగా ఉన్న సుకుమార్‌కు కూడా అలాంటి చేదు అనుభవమే ఉంది. అదేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రముఖ దర్శకుడిగా పేరున్న అతికొద్ది మందిలో మణిరత్నం ఒకరు. అటువంటి దర్శకుడి చేతిలో మరో ప్రముఖ దర్శకుడికి అవమానం జరిగింది. లేదా చేదు అనుభవం ఎదురైంది. లెక్కల మాస్టారి నుంచి ప్రముఖ దర్శకుడిగా మారిన సుకుమార్ స్వయానుభవమిది. ఇటీవల సుకుమార్ తెరకెక్కించిన పుష్ప బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న సుకుమార్ వెల్లడించిన కొన్ని విషయాల్ని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.


ప్రముఖ దర్శకుడు మణిరత్నం గురించి చెబుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో మణిరత్నం తీరుతో బాధపడ్డానంటూ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. తాను మణిరత్నం (Maniratnam) అభిమానినని..గీతాంజలి సినిమాతో మరింత పెరిగిందని సుకుమార్ వెల్లడించాడు. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు గర్ల్‌ఫ్రెండ్‌ను వదిలేసి వస్తున్నట్టు అన్పించిందన్నాడు. వాస్తవానికి గీతాంజలి ప్రభావంతోనే తాను దర్శకుడిగా మారానన్నాడు. అదే క్రమంలో ఆర్య సినిమా తరువాత ఓసారి మణిరత్నం ముంబైలో కన్పిస్తే..మాట్లాడేందుకు ప్రయత్నించానన్నాడు. ఆ సమయంలో నటి శోభనతో సీరియస్ డిస్కషన్ జరుగుతోందని..చాలా సేపు నిరీక్షణ తరువాత సార్ అంటూ దగ్గరకు వెళ్లానన్నాడు. అప్పుడాయన కోపంగా తనవైపు చూస్తూ..వెళ్లూ అంటూ చేయితో సైగ చేశారని..అది తనను చాలా బాధపెట్టిందని సుకుమార్ (Sukumar)వెళ్లడించాడు. తానెంతో అభిమానించే ఓ దర్శకుడు ఇలా చేయడం కష్టంగా అన్పించిందన్నాడు. ఓ దర్శకుడు సీరియస్‌గా స్క్రిప్ట్ గురించి చర్చిస్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఆ తరువాత తనకు అర్ధమైందన్నాడు. ఇప్పటికీ అతన్ని కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు సుకుమార్ వెల్లడించాడు.


Also read: Ramgopal Varma: ప్రభుత్వంతో పేచీకు దిగుతున్న ఆర్జీవీ, మరోసారి వివాదాస్పద ట్వీట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook