Aadi Sai Kumar Top Gear Teaser ఆది సాయి కుమార్ టాప్ గేర్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విధి రాత నుంచి విష్ణు మూర్తి కూడా తప్పించుకోలేకపోయాడు అన్నది ఎంత నిజమో నా నుంచి కూడా నువ్ తప్పించుకోలేవన్నది అంతే నిజం.. ఇప్పుడు రెండు ప్రాణాలు పోతాయ్..  అంటూ విలన్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ అవుతున్నాయి. ఈ టీజర్‌లో హీరోకి ఒక్క డైలాగ్ కూడా లేదు. ముందు నుంచి చెబుతున్నట్టుగా ఆది ఇందులో టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఈ టీజర్‌లో దాన్ని చూపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇక ఈ టీజర్‌లో వచ్చిన డైలాగ్, విజువల్స్, ఆది చేసిన కార్ చేజింగ్ సీక్వెన్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్‌ను చూసిన మారుతి చిత్రయూనిట్‌ను అభినందించాడు. టీజర్ బాగుందని మెచ్చుకున్నాడు. చిత్రయూనిట్ మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. టీజర్ చాలా బాగా కట్ చేశారని, టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థమవుతోందని అన్నాడు.


డిసెంబర్ 30న రాబోతోన్న టాప్ గేర్ సినిమాను కె.శశికాంత్ తెరకెక్కిస్తుండగా.. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో  కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రంలో ఆదికి జోడి రియా సుమన్ నటించింది. ఈ టీజర్‌లో హర్షవర్దన్ రామేశ్వర్ ఆర్ఆర్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ  హైలెట్ అయింది.


Also Read : HIT 2 Collections : హిట్ 2 కలెక్షన్లు.. రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన అడివి శేష్


Also Read : Rajamouli Oscar Award : రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం.. నెట్టింట్లో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook