Sai Rajesh New Car : సాయి రాజేష్ దర్శకుడిగానూ, నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. హృదయ కాలేయం సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి రాజేష్.. తన మార్క్ క్రియేట్ చేశాడు. అయితే కలర్ ఫోటో సినిమాను నిర్మించి.. నిర్మాతగా తన అభిరుచిని చాటాడు. కలర్ ఫోటో కథను కూడా సాయి రాజేష్‌ అందించిన సంగతి తెలిసిందే. కలర్ ఫోటో సినిమాకు వచ్చిన జాతీయ అవార్డును అందుకుంటూ సాయి రాజేష్ ఆనందం వ్యక్తం చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం సాయి రాజేష్ బేబీ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్యల కాంబోలో ఈ చిత్రం రాబోతోంది. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. నేషనల్ అవార్డు సాధించడంతో సాయి రాజేష్‌ సినిమాకు ప్రస్తుతం మార్కెట్లో మంచి వ్యాల్యూ ఉంది. అలా బేబీ సినిమాకు బిజినెస్ బాగానే జరిగినట్టు తెలుస్తోంది.


అయితే ఈ మూవీ మీదున్న నమ్మకం, సాయి రాజేష్ టేకింగ్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలైన మారుతి, ఎస్‌కేఎన్‌లు తమ దర్శకుడికి మంచి గిఫ్ట్ ఇచ్చారు. కాస్ట్ లీ కారుని సాయి రాజేష్‌కు బహుకరించారు. MG Hector Plus కారుని గిఫ్ట్‌గా ఇచ్చారంటూ సాయి రాజేష్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ కారు విలువల దాదాపు 16 నుంచి 20 లక్షల లోపు ఉంటుందని తెలుస్తోంది.


సాయి రాజేష్ కొత్త కారు మీద జనాలు స్పందిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ బ్రో.. సినిమా హిట్ అవ్వాలని కొందరు అంటే.. మాకు పార్టీ లేదా? అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా సాయి రాజేష్ తన ధీమాను వ్యక్తం చేశాడు. 


Also Read : Niharika Konidela Bikini : బికినీలో కనిపించి షాక్ ఇచ్చిన నిహారిక


Also Read : Adipurush case : ఆదిపురుష్‌కు దెబ్బ మీద దెబ్బ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook