Kalki 2898 AD Trailer Date : బాహుబలి మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్.. ఆ తరువాత కొన్ని ప్లాప్ లతో ఆడియన్స్ డార్లింగ్ క్రేజ్ తగ్గింది అనుకున్నారు అంతా. కానీ సలార్ సినిమాతో ఒక సూపర్ హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చి తన క్రేజ్ ని పాన్ ఇండియా లెవెల్ లో సుస్థిరం చేసుకున్నారు. సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. ప్రస్తుతం అందరి దృష్టి ‘కల్కి’ పై పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా అంచనాలు ఉందే చిత్రం కల్కి 2898 AD. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మహామహులు నటిస్తున్న ఈ చిత్రంలో లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా.. అలానే ఫ్యూచర్లో జరిగే విశేషాలను తెలిపే కథగా.. ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్టుపోన్ అయ్యింది. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు ఈ దర్శకుడు.


ముందుగా ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ..'కల్కి కోసం కొత్త వరల్డ్ ని బిల్డ్ చేశాం. ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో.. మీరు ఈ సినిమాలో  చూస్తారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె అందరి ఫ్యాన్స్, ఆడియన్స్ గొప్పగా ఎంజాయ్ చేసేలా ‘కల్కి’ వుంటుంది’ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.



ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కల్కి కి ఉన్న తేడా ఏమిటి అనే విషయం గురించి మాట్లాడుతూ..’మన దగ్గర సైన్స్ ఫిక్షన్ చిత్రాల ఎక్కువ రాలేదనే చెప్పాలి. కొన్ని టైం ట్రావెల్ సినిమాలు వచ్చాయి. కానీ కల్కి చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యుచరిస్ట్  సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. ఈ సినిమాలో  ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా వుండబోతునాయో ప్రేక్షకులు చూస్తారు. ఈ సినిమాలో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతిది భారతీయ మూలంతో ముడిపడి అది భవిష్యత్ లో ఎలా మార్పు చెందే అవకాశం వుందనే అంశంపైన ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రతిది డిజైన్ చేశాం. తెరపై ఈ విషయాలు అన్నీ అద్భుతంగా కనిపిస్తాయని నమ్మకం వుంది’ అని తెలియజేశారు.


కల్కి రిలీజ్ డేట్ అలానే ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనే వివరాలు చెబుతూ.. కల్కి రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని అలానే కల్కి ట్రైలర్ 93రోజుల తర్వాత ఉండొచ్చు అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ చిత్ర ట్రైలర్ రావడానికి ఇంకో మూడు నెలలు పడుతుంది అని చెప్పకనే చెప్పారు నాగ్ అశ్విన్. 


Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter