RAM Rapid Action Mission First Look and Glimpse: గత కొంతకాలంగా రియల్ లైఫ్‌ స్టోరీలను రీల్ లైఫ్‌లో చూపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుంటుకున్నారు మూవీ మేకర్స్. ఇలాంటి స్టోరీలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండంతో దర్శకనిర్మాతలు అలాంటి కథలపై ఎక్కవుగా ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అదే బాటలో మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఫస్ట్‌ లుక్, గ్లింప్స్‌ను ప్రముఖ డైరెక్టర్ పరుశురామ్ విడుదల చేశారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి దీపికాంజలి వడ్లమాని నిర్మిస్తున్నారు. ఈ గ్లింప్స్‌తో దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ హీరో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య అయ్యల సోమయజుల హీరోగా పరిచయం అవుతుండగా.. ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఆశ్రిత్ అయ్యంగార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తుండగా.. ధారణ్ సుక్రి డీఎసీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారి మెగా ఫోన్ పట్టిన మిహిరామ్ వైనతేయ.. కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ కూడా రాశారు.


ఇక గ్లింప్స్ విషయానికి వస్తే.. హీరో చెప్పిన డైలాగ్ డెలివరీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ఈ సీన్ చిత్రీకరించిన లొకేషన్.. హీరో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌కి కరెక్ట్‌గా యాప్ట్ అయ్యేలా ఉంది. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో గ్లింప్స్ ద్వారా కళ్ల ముందు చూపించారు మూవీ మేకర్స్. రామ్ (RAM- రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌) టైటిల్ మధ్యలో కనిపిస్తున్న అశోక చక్రం మరింత శక్తివంతం చేసింది. టైటిల్ లుక్‌తోనే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారని.. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.  


Also Read: Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook