ఎంతో మంది హీరోలను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు టాలీవుడ్  దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao). ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. సరిగ్గా 24 ఏళ్ల కిందట సందడి లాంటి సినిమా ‘పెళ్లి సందడి’ (Pelli Sandadi)ని చూపించారు. ఇప్పటికీ ఆ పాటలు వినిపించాయంటే చాలు స్వరం కదపని అప్పటి ప్రేక్షకులు ఉండరు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత మరోసారి పెళ్లి సందడి చూపించేందుకు దర్శకుడు రాఘవేంద్రరావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి ఓ క్లారిటీ ఇచ్చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన మూవీ పేరు ‘పెళ్లి సందD’ అని, అందులో భాగస్వాములు కానున్న టెక్నీషియన్ల వివరాలు  ఓ ప్రోమో వీడియో ద్వారా విడుదల చేశారు. 1996లో వచ్చిన పెళ్లిసందడి ఎంతో మంది నటీనటులతో పాటు టెక్నీషియన్లకు మంచి పేరు తీసుకొచ్చింది. లేటెస్ట్ మూవీకి సైతం కీరవాణి స్వరాలు సమకూర్చనున్నారు. మ్యూజిక్ పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. 



 



 


అప్పట్లో శ్రీకాంత్‌కు కెరీర్ ఆరంభంలో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఈ సినిమా లేటెస్ట్ వర్షన్‌లో ఆయన తనయుడు రోషన్ హీరోగా నటించబోతున్నాడని ప్రచారం జరగుతోంది. త్వరలో తారాగణంపై అప్‌డేట్స్ ఇస్తానని ఆ ప్రోమో ద్వారా తెలిపారు దర్శకేంద్రుడు. శ్రీకాంత్ లాగే ఈ పెళ్లి సందడDతో రోషన్ కెరీర్ పట్టాలెక్కాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నిర్మలా కాన్వెంట్ స్కూల్ అనే సినిమాతో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చాడు రోషన్. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe