Director Ram Gopal Varma tweets about AP minister Perni Nani invitation on cinema tickets issue: ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల విషయంపై చర్చించేందుకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో మంత్రి.. వర్మను చర్చలకు ఆహ్వానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా టికెట్‌ రేట్ల తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఏపీ సర్కార్‌‌ నిర్ణయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.


అయితే సినిమా టికెట్స్ రేట్స్‌పై చర్చించేందుకు తనను మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆహ్వానించారంటూ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు వర్మ. ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల విషయంపై మాట్లాడేందుకు మంత్రి నాని తనని ఆహ్వానించిన విషయాన్ని తెలియజేయడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. 


అమరావతిలోని సచివాలయంలో జనవరి 10న మధ్యాహ్నం తాము భేటీ అవుతున్నామని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలంటూ ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇక సినిమా టికెట్‌ రేట్స్ ( ticket rates) విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వర్మ ట్వీట్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అందులో మంత్రి పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ చాలా ట్వీట్స్ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించాడు వర్మ. దీని తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు వర్మపై కామెంట్స్ చేశారు. అలా కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. 


Also Read : Pushpa makers returned money: పుష్ప మూవీకి అక్కడ భారీ దెబ్బ.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తోన్న మూవీ మేకర్స్


అయితే చివరకు గవర్నమెంట్‌తో గొడవపడాలనేది తన ఇన్‌టెన్షన్ కాదని.. అనుమతిస్తే కలుస్తానంటూ వర్మ.. మంత్రి పేర్ని నానిని కోరారు. దీంతో త్వరలోనే కలుద్దాం అంటూ మంత్రి పేర్ని నాని రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనకు పేర్ని నాని (Perni Nani) నుంచి పిలుపు వచ్చిందంటూ రామ్‌ గోపాల్ వర్మ ట్వీట్‌ చేశారు.



 


Also Read : Corona in India: దేశంలో కరోనా ఉగ్రరూపం- వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook