RGV Back to Friend Movie: `హనీమూన్ ఎక్స్‌ప్రెస్` నుంచి తొలి పాట విడుదల.. అభినందించిన `ఆర్జీవీ`
RGV Released New Song: విభిన్నమైన కథా నేపథ్యంతో సినీ పరిశ్రమలో మరో చిన్న సినిమా రాబోతున్నది. ఇప్పుడు పరిశ్రమలో చిన్న సినిమాలే హవా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాము చిన్న సినిమాగా వస్తూ పెద్ది హిట్ కొడతామని `హనీమూన్ ఎక్స్‌ప్రెస్` చిత్రబృందం చెబుతోంది. సినిమాలోని `నిజమా` అనే తొలి పాటను విడుదలచేశారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండగా నిలిచారు.
Nijama Song Outed: వినోదభరితమైన సినిమాతో చైతన్య రావు, హెబ్బా పటేల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వారిద్దరూ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రాన్ని బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో అతడు రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయకుడిగా పని చేశాడు. కొన్ని సినిమాలకు సహకారం అందించాడు. ఇప్పుడు దర్శకుడిగా బాల రాజశేఖరుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎన్‌ఆర్‌ఐ ఎంటర్టైన్మెంట్స్ (యూఎస్‌ఏ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తీస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ సినిమాలో తొలి పాట 'నిజమా'ను మంగళవారం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. అందమైన ప్రేమ పాటను సుప్రసిద్ధ గాయని సునీత పాడారు.
పాటను చూసిన అనంతరం చిత్రబృందాన్ని రామ్‌గోపాల్ వర్మ అభినందించి మాట్లాడారు. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా నుంచి విడుదలైన 'నిజమా' పాట చాలా బాగుంది. పాటను అందంగా చిత్రీకరించారు. కెమెరమేన్ పనితీరు, లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడే కథ విన్నాను. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలి' అని ఆకాంక్షించారు.
అనంతరం దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. 'రామ్‌గోపాల్ వర్మతో రెండు హాలీవుడ్ చిత్రాలకు పని చేశా. బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశాను. రెండు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి. ఆర్జీవీ మాలాంటి వారికి స్ఫూర్తి. శివ సినిమా నన్ను దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు.
కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడీతో రూపుదిద్దుకుంటున్నది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ శిష్ట్లా వీఎమ్‌కే, ఎడిటింగ్ ఉమా శంకర్, పీఆర్‌ఓ పాల్ పవన్ వ్యవహరిస్తున్నారు. తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చకాచకా పూర్తి చేసేకుంటోంది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Also Read: Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook