Indian 2 Update: ఇండియన్ 2లో సరికొత్త టెక్నాలజీ.. నయా ప్లాన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న శంకర్..
Indian 2: కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఇండియన్ 2.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో కొత్త టెక్నాలజీని పరిచయం చేయబోతున్నారు శంకర్. ఇది కోలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది.
Indian 2 Movie Update: కమల్‌హాసన్ (Kamal Haasan)-శంకర్(Shankar) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఇండియన్ 2'(Indian 2). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
టెక్నాలజీ వాడుకోవడంలో శంకర్ తర్వాతే ఎవరైనా. అలాంటి మరో కొత్త సాంకేతికతను ఈ మూవీ కోసం వాడునున్నాడట శంకర్. డీ-ఏజింగ్ టెక్నాలజీని అభివృద్ది చేసే దిశగా లాస్ ఏంజెల్స్ నుంచి Lola VFX సాంకేతికతను తొలిసారి కోలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇది ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా మారింది. ఈ టెక్నాలజీ ద్వారా కమల్ హాసన్ ను మరింత యూనిక్ గా చూపించబోతున్నారట. మొత్తానికి సిల్వర్ స్క్రీన్‌పై ఈ కొత్త టెక్నాలజీ సినిమాను ఏ రేంజ్‌కు తీసుకెళ్లుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతోపాటు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ రూ.220 కోట్లకు దక్కిచుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను చెన్నై , లాస్ ఏంజెల్స్, తైవాన్, సౌతాఫ్రికా ప్రాంతాల్లో షూట్ చేశారు.
Also Read: Nithiin latest Movie: డిఫరెంట్ లుక్‍తో 'ఎక్స్ ట్రా ఆర్డనరీ మ్యాన్'గా వచ్చేసిన నితిన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook