Director Surender Reddy Injured in Agent Movie Sets: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏజెంట్ మూవీ షూటింగ్‌లో గాయపడ్డాడు. అక్కినేని అఖిల్‌తో ఏజెంట్ సినిమా తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి.. షూటింగ్‌లో భాగంగా కాలికి రాడ్ తగలడంతో ఆసుపత్రిలో చేరాడు. గాయానికి చికిత్స చేయించుకొని మళ్లీ సెట్‌లో అడుగుపెట్టి.. షూటింగ్ కొనసాగించాడు. గాయంతో బాధపడుతూనే.. ఏజెంట్ మూవీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. బిగ్‌ బాస్ ఫేమ్ అలీ రెజా సురేందర్ రెడ్డి గాయానికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేయగా.. వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఈ ఉదయం సెట్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. చాలా ధైర్యవంతుడు. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చి షూట్ చేస్తూనే ఉన్నాడు..' అని అలీ రెజా రాసుకొచ్చాడు. గెట్ వెల్ సూన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వైద్యులు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా.. తాను లేకపోతే మొత్తం షూటింగ్ ఆగిపోతుందని సురేందర్ రెడ్డి మాత్రం నొప్పిని భరిస్తూ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టాడు. కాలు కట్టుకుని వీల్ చక్రాల బండి నుంచే యాక్షన్, కట్ అంటూ కీలక సన్నివేశాలను షూట్ చేయించాడు.


 



ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు. బాడీ పెంచి.. సిక్స్ ప్యాక్ లుక్ కోసం పిచ్చెక్కేలా కష్టపడుతున్నాడు. అయితే ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. మధ్యలో అయితే ఈ చిత్రం ఆగిపోయిందంటూ రూమర్లు కూడా వచ్చాయి. నిర్మాత, బడ్జెట్‌ ఎక్కువ అవుతోందనే కారణంతో ఆపేశారంటూ కథనాలు వచ్చాయి. 


అయితే అన్ని అడ్డంకులు దాటుకుని ఏజెంట్ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా షూటింగ్ చేస్తోంది. మళ్లీ ఇంతలోనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాలికి గాయం కావడం ఇబ్బందిగా మారింది. అయినా ఆయన లెక్కచేయకుండా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు పూనుకున్నారు. ఈ సినిమాలో అఖిల్ లుక్ ఇది వరకంటే చాలా కొత్తగా ఉంది. ఇటీవల అఖిల్ తన కొత్త లుక్కుకు సంబంధించిన ఫోటోను షేర్ చేయగా.. అభిమానులను తెగ ఆకట్టుకుంది. 


Also Read: Prabhas Broke into Tears: షోలో కన్నీటి పర్యంతం అయిన ప్రభాస్, బాలకృష్ణ.. హగ్ చేసుకుని మరీ!


Also Read: Tunisha Sharma Death: తునీషా శవమై ఉంటే సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో షీజాన్ ఛాటింగ్.. గంట పాటు అలాగే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook