Rama Banam Promotions లక్ష్యం, లౌక్యం తరువాత రామబాణం అంటూ శ్రీవాస్ గోపీచంద్ కాంబో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయింది. రామబాణం సినిమా మే 5న రాబోతోంది. ఈ మూవీ టైటిల్‌ను సైతం బాలయ్యే సూచించాడన్న విషయం కూడా తెలిసిందే. అన్ స్టాపబుల్ షోలో గోపీచంద్ గెస్టుగా వచ్చినప్పుడు.. బాలయ్య ఈ టైటిల్‌ను సూచించాడు. రామబాణం అని పెట్టుకో.. సినిమా హిట్ అవుతుంది అని అన్నాడు. దీంతో ఆ సినిమా టైటిల్‌ను రామబాణం అని ఫిక్స్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తేజతో గోపీచంద్ ఇంటర్వ్యూని ప్లాన్ చేశారు. ఇక తేజ అంటే నిర్మొహమాటంగా నిజాలు చెప్పేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. జయం, నిజం సినిమాల్లో గోపీచంద్‌ను అద్భుతంగా చూపించి విలన్‌కు ఓ మార్క్ సెట్ చేశాడు తేజ. అయితే అలాంటి తేజ ఫోన్ చేస్తే కూడా గోపీచంద్ ఎత్తలేదట. ఆ విషయం గురించి కూడా అడిగాడు తేజ.


 



ఇక ఈ సినిమా టైటిల్‌ను బాలయ్య ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది.. ఆయన చెబితే టైటిల్ పెట్టారా? అంటూ అడిగాడు తేజ. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీవాస్‌కు గోపీచంద్‌కు మధ్య గొడవలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. దాని మీద కూడా తేజ ప్రశ్నలు సంధించాడు. ఇక ఓ సినిమా కోసం గోపీచంద్‌ను అప్రోచ్ అయితే హీరోయిన్‌ విషయంలో తేడాలు వచ్చాయట. వేరే హీరోయిన్‌ను పట్టుకొచ్చే లోపు.. ఇంకో సినిమాకు ఓకే చెప్పాడని.. ఆ టైంలోనూ ఫోన్ లిఫ్ట్ చేయలేదని తేజ గుర్తు చేసుకున్నాడు.


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి


మీ నాన్న మంచితనం చూసే జయంలో పెట్టుకున్నాను.. మీ నాన్న గొప్పోడే.. నువ్వేం పీకావ్ అంటూ గోపీచంద్‌ను కడిగిపారేశాడు డైరెక్టర్ తేజ. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. ట్రైలర్ చూస్తే రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించిన సినిమాగానే అనిపిస్తోంది. మరి ఈ సినిమాకు ఆడియెన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.


Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook