Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక

Niharika Konidela with Niharika NM నిహారిక కొణిదెలకు, సోషల్ మీడియా సెలెబ్రిటీ నిహారికకు మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే చోటకు వచ్చారు. రాత్రి ఒకే చోట ఉన్నట్టుగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 10:35 AM IST
  • నెట్టింట్లో నిహారిక సందడి
  • ఇంఫ్లూయెన్సర్‌ నిహారిక హల్చల్
  • ఒకే చోట ఇద్దరు నిహారికలు
Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక

Niharika Konidela with Niharika NM మెగా డాటర్ నిహారిక, ఇంఫ్లూయెన్సర్ నిహారికలు ఇప్పుడు కలిసి సందడి చేస్తున్నారు.  ఈ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఇక నిన్నటి రాత్రి ఈ ఇద్దరూ సినిమా చూస్తూ ఇంట్లోనే ఎంజాయ్ చేసినట్టుగా కనిపిస్తోంది. మూవీ టైం అంటూ ల్యాప్ ట్యాప్‌లో సినిమాను చూస్తూ, స్నాక్స్ తింటూ సందడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరి నిహారికల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిహారిక కొణిదెల పర్సనల్ విషయాలు ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. నిహారిక తన భర్త చైతన్యకు దూరంగా ఉంటోందని, ఈ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారని రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇలా ఎన్ని రకాల రూమర్లు వచ్చినా కూడా నిహారిక స్పందించడం లేదు. తన పనిలో తాను బిజీగా గడిపేస్తోంది. కొత్త వెబ్ సిరీస్‌ల పనిలో నిహారిక నిమగ్నమై ఉంది.

అయితే నిహారిక మాత్రం రెగ్యులర్‌గా జిమ్ చేస్తూనే ఉంది. వితిక షెరు, నిహారికలు కలిసి జిమ్‌లో సందడి చేస్తున్నారు. ఒకప్పుడు అయితే చైతన్య, నిహారికలు కలిసి జిమ్‌కు వెళ్లే వారు. ఇప్పుడు అయితే ఆమె వితికతోనే కనిపిస్తోంది. అసలు ఎక్కడా కూడా చైతన్య, నిహారికలు కలిసి కనిపించినట్టుగా ఫోటోలు మాత్రం బయటకు రావడం లేదు. ఇక సోషల్ మీడియాలోనూ తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం, ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం వంటివి చూస్తుంటే వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్టు అర్థం అవుతోంది.

Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

కళ్యాణ్‌ దేవ్ శ్రీజల వ్యవహారం కూడా ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఈ ఇద్దరూ గత రెండేళ్లుగా దూరంగానే ఉంటున్నారని, విడాకులు అయ్యాయని రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇంత వరకు ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు నిహారిక చైతన్య విషయంలోనూ ఇలాంటి రూమర్లే వస్తున్నాయి. నిహారిక చైతన్య విడాకుల రూమర్లపై మెగా ఫ్యామిలీ స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News