బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీయబోతున్న తేజ మరో వైపు వెంకటేష్ తో కూడా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇటీవలే వెంకటేష్ తో సినిమా చేయబోతున్నట్లు వచ్చిన వార్త పై క్లారిటీ ఇచ్చి త్వరలోనే బాలకృష్ణ, వెంకటేష్ లతో సినిమాలు చేయబోతున్నాని ఈ రెండు సినిమాలు త్వరలోనే స్టార్ట్ కానున్నాయని.. సోషల్ మీడియా ద్వారా తెలిపాడు తేజ.


‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో దర్శకుడిగా పూర్వ వైభవం తెచ్చుకున్న తేజ ఈ ఇద్దరు సీనియర్ లతో సినిమా చేయనుండడంతో ఈ రెండు సినిమాలపై ప్రస్తుతం అందరిలో క్యూరియాసిటీ నెలకొంటుంది. బాలకృష్ణ తో పొలిటికల్ డ్రామా తెరకెక్కించబోతున్న తేజ వెంకటేష్ తో ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అయితే ఈ రెండిటిలో తేజ ఏది ముందు సెట్స్ పైకి తీసుకెళ్తాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గా మిగిలింది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాకు సంబంధించి స్కిప్ట్ వర్క్ చేస్తున్న తేజ మరో వైపు వెంకీ సినిమా ప్రీ ప్రొడక్షన్  పనులు కూడా చూస్తున్నాడట. మరి ఈ ఇద్దరిలో తేజ ఏ సీనియర్ హీరోతో ముందడుగేస్తాడో…?