Director Trivikram srinivas shocking remuneration: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. ఈయన సినిమాలతోపాటు ఆయన మాటలకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మాటల మాంత్రికుడి నుంచి మూవీ వస్తుందంటే ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది. దర్శకుడు కాకముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశారు త్రివిక్రమ్. ఆయన తెరకెక్కించిన  ఖలేజా, అజ్ఞాతవాసి సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఓ పక్క సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే.. మరోపక్క ఇతర దర్శకుల మూవీస్ కు కూడా స్క్రీన్ ప్లే అందిస్తూ ఉంటారు త్రివిక్రమ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ చేస్తోన్న 'బ్రో' సినిమాకు కూడా ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ మూవీ కోలీవుడ్ చిత్రం వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కు జంటగా కేతిక శర్మ నటిస్తోంది. మరోవైపు ప్రియాప్రకాశ్ వారియర్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా జూలై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. 


Also read: Kushi second Single: 'ఖుషి' నుంచి మరో మెలొడీ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'ఆరాధ్య' పాట..


'బ్రో' సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నందుకు త్రివిక్రమ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.  ఈ మూవీ కోసం మాటల మాంత్రికుడు రూ. 15 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. ఇదే నిజమైతే పెద్ద హీరోలకు సరిసమానంగా త్రివిక్రమ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారన్న మాట. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్ బాబుతో 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రీలల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 


Also Read: 'కష్టపడ్డా, యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేశా , ఇప్పుడు అనుష్క తో సినిమా చేశా': వైరల్ అవుతున్న నవీన్ పోలిశెట్టి డైలాగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook