Trivikram Birthday : మాటల మాంత్రికుడు అనే పదానికి త్రివిక్రమ్ కచ్చితంగా సరిపోతాడు. త్రివిక్రమ్ చేసిన మాయ అటువంటిది. పాటల కోసం జనాలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తుంటారు. ఫైట్స్, డ్యాన్స్ కోసం కూడా సినిమాలను చూస్తుంటారు జనాలు. కానీ కేవలం మాటల కోసమే మళ్లీ మళ్లీ సినిమాను చూసేలా చేసింది మాత్రం త్రివిక్రమ్. అతని కలం చేసిన మాయాజాలానికి ఓ తరం అంతా కూడా ప్రభావానికి లోనైంది. సాధారణ జనాలు సైతం త్రివిక్రమ్ శైలిని అనుసరించేస్తుంటారు. త్రివిక్రమ్ పదాలు, మాటలు కూడా సాధారణ వాడుక భాషల్లోంచే వస్తాయి. పెద్ద పెద్ద సాహిత్య పండితులు చెప్పే భాషలో త్రివిక్రమ్ చెప్పడు. సాధారణ పదాలను వాడుతూ.. సారాన్ని చెప్పడంలో త్రివిక్రమ్ ఎప్పుడూ దిట్టే. ఆయన సినిమాల్లోని కొన్ని డైలాగ్స్ ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అజ్ఞాతవాసి సినిమాలోని ఈ డైలాగ్ త్రివికమ్ మార్క్‌ను చూపిస్తుంది. 'ఇది మనం కూర్చునే కుర్చీ.. పచ్చటి చెట్టును గొడ్డలితో నరికి.. రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి.. బెరడును బ్లేడుతో సానబెట్టి.. ఒళ్లంతా మేకులు కొట్టి కొట్టి తయారు చేస్తారు.. ఎంత హింస దాగి ఉందో కదా?.. జీవితంలో మనం కోరుకునే ప్రతీ చిన్న సౌకర్యం వెనుక.. ఓ మినీ యుద్దమే ఉంటుంది' అనే ఈ ఒక్క డైలాగ్ త్రివిక్రమ్ ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తాడు. చిన్న భావాన్ని కూడా పెద్దగా చెప్పడం ఆయనకు మాత్రం చెల్లుతుంది.


ప్రేమను చెప్పడం, చూపించడం, వ్యక్తికరించే సన్ని వేశాల్లోనూ ఆయన రాసే పదునైన మాటలు ఇప్పటికీ ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. ఒక్క మాటలో ఎంతో అర్థాన్ని చూపెట్టడం కేవలం త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్, రైటింగ్‌కు మాత్రమే సొంతం. అతడు సినిమాలోని కొన్ని మాటలు వాటికి ఉదాహరణగా నిలుస్తాయి. క్లైమాక్స్ సీన్‌లో త్రిష.. నేనూ వస్తాను అని అంటే.. నేనే వస్తాను అని మహేష్‌ బాబు చెప్పే ఆ డైలాగ్.. సీన్‌ను నిలబెట్టేస్తుంది. ఆ ఒక్క చిన్న అక్షరాన్ని మార్చేయడంతో ఆ సీన్లో చెప్పాలనుకున్న ఉద్దేశ్యం అందరికీ అర్థమైంది. పెద్ద పెద్ద డైలాగ్స్ పెట్టి, సీన్‌ను లాగదీయకుండానే త్రివిక్రమ్ మాయచేశాడు.


యుద్దంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు.. ఓడించడం అంటూ పవన్ కళ్యాణ్ చేత చెప్పించిన డైలాగ్ అందరినీ ఆలోచింపజేస్తుంది. నువ్వే నువ్వే సినిమాలో డబ్బుతో అన్నీ కొనలేమని చెప్పే సందర్భంలో రాసిన డైలాగ్స్ అందరినీ కట్టిపడేస్తుంది. డబ్బుతో బ్రెడ్డుని కొనగలరు కానీ ఆకలిని కొనలేరు.. బెడ్డును కొనగలరు కానీ నిద్రను కొనలేరు.. అన్నింటి కంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు అంటూ తరుణ్ చెప్పే డైలాగ్స్‌ మనసును హత్తుకుంటాయి.


ఇలా త్రివిక్రమ్ చేసిన ప్రతీ సినిమా, రాసిన ప్రతీ డైలాగ్ అందరికీ ఎక్కడో సారి ఎక్కడో చోట కదిలించి ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా కూడా మాటలు మాత్రం నిలిచిపోతాయి. ఖలేజా సినిమాలో చివర్లో వచ్చే డైలాగ్.. అద్భుతం జరగక ముందు ఎవ్వరూ గుర్తించరు.. జరిగిన తరువాత గుర్తించాల్సిన అవసరం లేదు.. దేవుడివి అని నమ్మాల్సిన పని లేదు.. మమ్మల్ని నమ్మించాల్సిన పని లేదు.. సామీ ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం అంటూ అద్భుతంగా రాసిన మాటలే త్రివిక్రమ్ సత్తాను చాటుతుంటాయి.


సినిమాను నడిపించాలంటే మాటల్లాంటి తూటాలు కూడా అవసరం అని చెప్పిన త్రివిక్రమ్‌కే ఆ డైలాగ్స్ సూట్ అవుతాయి. సినిమాలు నడవాలంటే మాటలు ముఖ్యమని చెప్పిన త్రివిక్రమ్‌ సినిమాలే నిదర్శనం. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఎక్కువగా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలోనే బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌ కోసం రీమేక్స్ తీసుకోవడం, వాటికి స్క్రిప్ట్‌లు రాయడం పనిగా పెట్టుకున్నాడు. అయితే మహేష్‌ బాబుతో చేస్తోన్న ఈ సినిమాతో మళ్లీ త్రివిక్రమ్ తన మార్క్ చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.


Also Read : Bigg Boss Geetu Elimination : ఎంత ఏడ్చినా ఏమీ లాభం.. చివరకు గీ'థూ' అనిపించుకుంది.. ఇదే గుణపాఠం


Also Read : Rahul Ramakrishna Wife Pregnant : తండ్రి కాబోతోన్న రాహుల్ రామకృష్ణ.. వెరైటీగా ప్రకటన.. నెటిజన్ల ట్వీట్లు వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook