Disha Patani Set to Replace Samantha in Pushpa 2 Item Song: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. గతేడాది డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సాంగ్, డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో మొన్నటివరకు దేశవ్యాప్తంగా ఏడ చూసినా.. పుష్ప మేనియానే నడిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావా' అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సమంత డాన్స్, బోల్డ్‌నెస్, కిల్లింగ్ లుక్స్ అభిమానులకు బాగా నచ్చింది. దాంతో ఈ స్పెషల్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతాఇంతా కాదు. యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటేసి పెద్ద సంచలనం సృష్టించింది. అయితే పుష్ప-2లో కూడా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసారు సుకుమార్. అయితే ఈ ఐటమ్ పాటలో సమంతకు ఛాన్స్ దక్కే అవకాశం లేదని సమాచారం తెలుస్తోంది. 


తాజా సమాచారం ప్రకారం.. పుష్ప-2లోని స్పెషల్ సాంగ్ కోసం సమంత స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీని తీసుకోనున్నారట. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఈ రూమర్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజానికి ఊ అంటావా పాట కోసం ముందుగా దిశాను మేకర్స్ సంప్రదించారట. అయితే రెమ్యూనరేషన్ వంటి కారణాలతో అప్పుడు సాంగ్ చేయడానికి నిరాకరించిందట. ఇక పుష్ప-2లో మాత్రం ఐటమ్ సాంగ్ చేయడానికి దిశా ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దిశా పరిచయమే. 


Also Read: BAN vs SA: టీమిండియా వైట్‌వాషైన చోట.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌!!


Also Read: Gold and Silver Prices Today: తగ్గిన పసిడి ధర.. హైదరాబాద్‌లో తాజా బంగారం, వెండి రేట్లు ఇవే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook