March 24th 2022 Gold and Silver Prices In Hyderabad: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ కారణంగా ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో 10 గ్రాముల పసిడి ధర రూ. 53 వేలకు దూసుకెళ్లింది. అయితే గతకొన్ని రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం బంగారం ధర నిలకడగా ఉండగా.. బుధవారం కాస్త పెరిగింది. ఇక గురువారం (మార్చి 24) పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.
ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 400 తగ్గగా.. 24 క్యారెట్ల ధరపై కూడా రూ. 430 దిగొచ్చింది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.67,600గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ. 1300 తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,670గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,670గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,810గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,160 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350.. 24 క్యారెట్ల ధర రూ.51,670గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,670గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,350.. 24 క్యారెట్ల ధర రూ.51,670గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,670 వద్ద కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,900లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.71,900లుగా కొనసాగుతోంది.
Also Read: Today Horoscope March 24 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది!!
Also Read: Upendra New Look: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర షాకింగ్ లుక్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook