Pushpa Song Dispute: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా..లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో రేపు విడుదల కానుంది. ఈ నేపధ్యంలో పుష్ప సినిమాలో ఓ పాటపై మగవారికి కోపమొచ్చింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకెక్కారు. మగజాతిని అవమానించేదిగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమాలో ఇప్పటికే విడుదలై పాటలన్నీ ఓ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. దేవి శీప్రసాద్ సంగీతంలో రూపు దిద్దుకున్న పాటలు వైరల్ అవుతున్నాయి. శ్రీవల్లి పాట(Srivalli Song)సెన్సెషన్‌ను మించి తాజాగా విడుదలైన ఊ అంటావా మావా పాట షేక్ చేస్తోంది.యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. సమంతక తొలిసారిగా చేసిన ఐటమ్ సాంగ్ ఇది. సమంత సోయగాలు, పాట పాడిన మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహన్ గొంతులోని మత్తు, చంద్రబోస్ రాసిన లిరిక్స్ పాటను హైలైట్‌గా నిలిపాయి. అన్నింటికి మించి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం. 


అంతా బాగుందనుకునే సమయంలో ఊ అంటావా మావా పాటపై వివాదం(Dispute over Oo antava mova song) ప్రారంభమైంది. ఈ పాటపై మగవారికి కొపమొచ్చింది. మగవాళ్లపై తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా పాట ఉందంటూ ఏపీ పురుషుల సంఘం(Mens Association) ఫిర్యాదు చేసింది. పుష్ప(Pushpa)టీమ్‌తో పాటు సమంతపై కూడా పురుషుల సంఘం కేసు పెట్టింది. పాటను నిషేధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పురుష సంఘం సభ్యులు. మీ మగబుద్ధే వంకరబుద్ధి అనే పదాలు మగవారి కోపానికి కారణమయ్యాయి.


ఈ పాటపై మగవారి అభిప్రాయమిలా ఉంటే..మహిళలు మరోలా వాదిస్తున్నారు. మగవారు అంతగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదని మహిళాలోకమంటోంది. చాలా ఏళ్లుగా ప్రతిపాటలో ఆడవాళ్ల అంగాంగాలను వర్ణిస్తూ ఉన్నప్పుడు లేని అభ్యంతరం..వంకరబుద్ధి అంటే వచ్చేసిందా అని మండిపడుతున్నారు. కేవలం వంకరబుద్ధి అంటేనే మీకు కోపమొస్తే..ఇన్నాళ్లూ ఎన్ని బూతు పదాల్ని మహిళలపై ఆపాదిస్తూ రాశారో తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.కేసును హైకోర్టు(Ap High Court)ఎలా పరిగణిస్తుందో ఆసక్తిగా మారింది.


Also read: Pushpa First Review: పుష్ప అదుర్స్..బెస్ట్ టాలీవుడ్ 2021 సినిమా అంటున్న ఫస్ట్ రివ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook