Diwali 2021: దీపావళి అంటేనే ఓ సంబరం. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలకు మరీ ప్రీతి. సాయంత్రం కాగానే దీపావళి సంబరాలు, కాకరవత్తులు, లక్ష్మీ టపాసులు, భూచక్రాలు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లతో సందడిగా ఉంటుంది. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కు ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయిట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్నపిల్లలు సంతోషంతో, సందడితో ఎదురుచూసి మరీ జరుపుకునే ముఖ్యమైన పండుగ దీపావళి(Diwali 2021). బంధువులతో, తల్లిదండ్రులు, అన్నదమ్నులు లేదా అక్కచెళ్లెళ్లతో సందడితో జరుపుకుంటారు. కావల్సినన్ని కాకరవత్తులు, లక్ష్మీ టపాసులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వులు, భూచక్రాలతో కేరింతలు కొడతారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ చిన్ననాటి దీపావళి సంబరాల్ని గుర్తు చేసుకుంటోంది. ప్రస్తుతం దీపికా పదుకోన్..ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. 


బాలీవుడ్ నటి దీపికా పదుకోన్(Deepika Padukone) బాల్యమంతా బెంగళూరులో గడిచింది. చిన్నతనంలో దీపావళి వస్తుందంటే సందడి మామూలుగా ఉండేది కాదని నాటి విశేషాల్ని గుర్తు తెచ్చుకుంటోంది. బిల్డింగ్‌లో ఉన్న మిగిలిన పిల్లలు అందరితో కలిసి కిందకు దిగి టపాసులు కాల్చేవారట. ఆ రోజు స్వీట్లతో పండుగ మామూలుగా ఉండేది కాదని చెబుతోంది. అంతే కాదు, ఎవరు ఎప్పుడు దీపావళి గురించి ప్రస్తావించినా, ఇంట్రస్టింగ్‌ విషయం గుర్తుకొస్తుందని చెబుతోంది దీపికా పదుకోన్. ఇంట్లో అందరి పేర్లకు దీపావళితో సంబంధముందట. దీపికా తల్లి పేరు ఉజ్వల పదుకోన్ అయితే తండ్రి పేరు ప్రకాశ్ పదుకోన్, సోదరి అనిశ పదుకోన్. ఇలా అందరి పేర్లకు వెలుగుతో కనెక్షన్ ఉందని చెబుతోంది దీపికా. అప్పుడప్పుడూ ఇదే అంశంపై సరదాగా మాటలు సాగుతాయని అంటోంది. 


ప్రతి యేటా దీపావళి పార్టీ వైభవంగా నిర్వహించే దీపికా పదుకోన్ గత ఏడాది మాత్రం కేవలం సన్నిహితులతోనే జరుపుకుంది. ఈసారి ముంబైలో కాస్త గ్రాండ్‌గానే పార్టీ ప్లాన్ చేస్తోంది. రణవీర్ సింగ్‌తో(Ranveer Singh) కలిసి నటించిన 83వ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. క్రికెటర్ కపిల్‌దేవ్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఫైటర్ సినిమా సెట్స్‌పై ఉంది. అటు షకున్ బాత్రా సినిమా పెండింగ్‌లో ఉంది. ప్రభాస్ సినిమా ప్రోసెస్‌లో ఉంది. చిన్నతనంలో బెంగళూరులో దీపావళి(Deepika Diwali Celebrations in Bengaluru)ఎలా జరుపుకునేదో వివరంగా అందరికీ చెబుతోంది.


Also read: Vishal on Puneeth Rajkumar: ఆ పిల్లల చదువు, సంరక్షణ భాద్యత నాదే అంటున్న విశాల్‌కు నెటిజన్ల ప్రశంసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి