Diwali Telugu Medium iSchool Episode: బుల్లితెర ఆడియన్స్‌కు సరికొత్త, వినూత్నమైన కార్యక్రమాలతో జీ తెలుగు వినోదాన్ని అందిస్తోంది. ఈ దీపావళి పండుగను మరింత స్పెషల్‌గా మారుస్తూ సరికొత్త స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసింది. సీనియర్ హీరో నరేష్‌ తొలిసారి ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. బుల్లితెర ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. తెలుగు మీడియం ఐస్కూల్​ పేరుతో దీపావళి స్పెషల్​ ఎపిసోడ్ ప్రసారం కానుంది.​ నవంబర్ 12న రాత్రి 9 గంటలకు జీ తెలుగులో చూసి ఆనందించండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు ముంగిళ్లలో వెలుగులు నింపే దీపాల పర్వదినం దీపావళి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను జీ తెలుగు తెలుగు మీడియం ఐస్కూల్​ వేదికగా ప్రత్యేక ఎపిసోడ్‌​తో సరికొత్తగా నిర్వహించనుంది. దీపావళి స్ఫూర్తిని ప్రతి ఇంటికి తీసుకురావడం ద్వారా ఈ అందమైన పండుగ ప్రాముఖ్యతకు అనుగుణంగా ఈ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. తెలుగు సంప్రదాయాల ఆప్యాయతకు.. సమగ్రతకు ప్రతీకగా నిలిచే నలుగు స్నానంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు.. బుల్లితెర ప్రేక్షకుల మనసును హత్తుకునే అనుభూతిని కలిగిస్తాయి. 


సంప్రదాయ నరకాసుర వధ నిర్వహించనున్నారు. ఇక ఈ సంప్రదాయ వేడుకల్లో గ్రామస్థుల కోరికతో విదేశీ కంటెస్టెంట్లలో ఒకరైన అలెక్స్​ చీర కట్టుకుని ర్యాంప్​ వాక్​ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తోపాటు అందమైన పల్లె వాతావరణానికి.. గ్లామర్​ ప్రపంచానికి మధ్య పోలికలు, తేడాల వివరణతో కూడిన ఇంటాక్షన్‌ ఆద్యంతం నవ్వులు పూయించంనుంది. తరుణ్ మాస్టర్ ఎంట్రీతోపాటు బుల్లెట్‌​పై సీనియర్​ హీరో నరేష్ స్పెషల్ ఎంట్రీ ప్రత్యేకంగా ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లో స్పెషల్​ ఎంట్రీతోపాటు.. "బావలు సయ్యా.." పాటకు మహేష్‌తో పాండు డాన్స్ చేయడం ఆకట్టుకోనుంది.


నరేష్, తరుణ్ మాస్టర్, పల్లెటూరి అమ్మాయిలతో ఫైమా చేసిన మాస్ డ్యాన్స్ నవ్వులు పూయించనుంది. టంగ్​ ట్విస్టర్ ఛాలెంజ్, జరీ డైలాగ్ వంటి గేమ్స్‌ వినోదం పంచనున్నాయి. గ్రామస్థులతో అరియానా మాట్లాడిన మాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వినోదం, సాంప్రదాయం కలయికతో ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంట నవ్వులు పంట పూయించేందుకు జీ తెలుగు తెలుగు మీడియం ఐస్కూల్​ ప్రత్యేక ఎపిసోడ్‌​తో మీ ముందుకు రానుంది. డోంట్ మిస్ ఇట్. ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో న్యూస్‌లో ప్రసారం కానుంది. 


Also Read: Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


Also Read: 3 Liters Instant Water Geyser Price: క్రోమాలో దీపావళి ఆఫర్స్‌..Usha Instano 3 లీటర్స్‌ వాటర్ గిజర్‌ను రూ.3,550కే పొందండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook