Allu Arjun Calls Chiranjeevi as Chikababi: అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ నట వారసుడిగా తెరంగ్రేటం చేయకుండా నిర్మాతగా మారడంతో ఇక అల్లు ఫ్యామిలీ నుంచి నటులు ఉండరేమో అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ నటన మీద ఆసక్తి చూపించారో అప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ ఇద్దరూ అల్లు అర్జున్ ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. అలా ముందుగా గంగోత్రి సినిమాతో హీరోగా మారిన అల్లు అర్జున్ ముందు నుంచి తన తండ్రికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తన మామ చిరంజీవి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తూ వచ్చేవాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఎందుకో మెగా కుటుంబానికి, మెగా క్యాంప్ కు దూరంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే అప్పట్లో ఒకసారి జై పవర్ స్టార్ అనమని అభిమానులు కోరితే నేను అనను అని అల్లు అర్జున్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి దూరం పెరిగినట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయం ఎప్పటికప్పుడు రెండు కుటుంబ సభ్యులు ఖండిస్తూనే వచ్చారు. అయితే ఈ మధ్య కూడా అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఎలాంటి విష్ చేయలేదని సోషల్ మీడియా వేదికగా విష్ చేయకపోవడంతో మీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం తెర మీదకు వచ్చింది.


అయితే వాస్తవానికి ఆయన ఫోన్ చేసో లేక మెసేజ్ చేసో రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఉండవచ్చు. కానీ సోషల్ మీడియా వేదికగా తెలపక పోవడంతోనే అభిమానుల్లో కాస్త కొత్త అనుమానాలు రేకెత్తినట్లు అయింది. అయితే గంగోత్రి సినిమా రిలీజయి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవి అల్లు అర్జున్ విష్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టగా దానికి అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ మీరు ఎప్పటికీ నా హృదయంలోనే ఉంటారని మీ మీద నాకున్న కృతజ్ఞత భావం నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా చెబుతూనే చిక బాబీ అంటూ పేర్కొనడం హాట్ టాపిక్ అయింది.


అసలు ఈ పదం ఏంటి గతంలో కూడా ఒకసారి అల్లు అర్జున్ ఇదే విధంగా చిరంజీవిని సంబోధించారు. దీని అర్థం ఏమి ఉంటుందని అభిమానులు, పెద్ద ఎత్తున నెట్లో వెతికేస్తున్నారు అయితే ఈ అర్థం ఎవరికీ తెలియదు. స్వయంగా అల్లు అర్జున్ లేదా చిరంజీవి బయట పెడితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కొంతమంది చిన్న బాబాయ్ అని సంబోధిస్తున్నారేమో అని కామెంట్లు చేస్తున్నారు. అయితే మేనమామ అని అలా ఎలా సంభోదిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే బహుశా చిన్నప్పుడు పిల్లలకు నోరు తిరక్క ఏదో ఒక విధంగా కొన్ని పదాలను పలుకుతూ ఉంటారు. పెద్దయిన తర్వాత కూడా అదే అలవాటు అయిపోతుంది. బహుశా అల్లు అర్జున్ చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని అలా సంబోధిస్తూ ఉండి ఉండేవారని అదే పెద్దయిన తర్వాత కూడా అలవాటై ఉంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.
Also Read: Saif Ali Khan Son News: స్టార్ హీరో కుమారుడు గే.. సంచలనం రేపుతున్న ట్వీట్!


Also Read: Ram Charan Lineup: మెంటల్ ఎక్కిస్తున్న రామ్ చరణ్ మాస్ లైనప్.. ఎవరెవరితో సినిమాలు ఉన్నాయంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook