Ram Charan Upcoming Movies: టాలీవుడ్ హీరోలను భయపెట్టిస్తున్న రామ్ చరణ్ మాస్ లైనప్.. ఎన్ని సినిమాలు లైన్లో ఉన్నాయంటే..?

Ram Charan Line up: రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని గ్లోబల్ స్టార్ గా మారిపోయిన క్రమంలో ఆయన చేస్తున్న తదుపరి సినిమాల మీద ఒక లుక్ వేద్దాం పదండి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 31, 2023, 09:10 AM IST
Ram Charan Upcoming Movies: టాలీవుడ్ హీరోలను  భయపెట్టిస్తున్న రామ్ చరణ్ మాస్ లైనప్.. ఎన్ని సినిమాలు లైన్లో ఉన్నాయంటే..?

Latest Upcoming Movies of Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు స్వయంగా తన చేతులతో అందుకో లేదు అన్నమాటే కానీ ఆర్ఆర్ఆర్ హీరోగా గ్లోబల్ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఆయన ఆచార్య సినిమాలో కనిపించాడు కానీ ఆ సినిమా చిరంజీవి ఖాతాలో పడింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్సి 15కి గేమ్ చేంజర్ అనే టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ప్రస్తుతానికి రామ్ చరణ్ సినిమాల లైనప్ మనం పరిశీలిస్తే రామ్ చరణ్ 16వ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్క బోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహితులు సతీష్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ఆ తర్వాత రాంచరణ్ 17వ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద రూపొందుతోంది.

ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయం మీద క్లారిటీ లేదు కానీ కన్నడ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది.. కానీ ఆ సినిమా ఎవరి బ్యానర్లో తెరకెక్కుతోందనే విషయం మీద క్లారిటీ లేదు. మరోపక్క రామ్ చరణ్ 18వ సినిమా డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాకి కూడా దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయం మీద క్లారిటీ లేదు.

నిజానికి రామ్ చరణ్ తేజను గ్లోబల్ స్టార్ అని అభిమానులు సంభోదిస్తున్నారు కానీ ఆయన మాత్రం ఎందుకో ఆ ట్యాగ్ తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఎప్పటిలాగే తనను మెగా పవర్ స్టార్ అని మాత్రమే పిలవాలని రామ్ చరణ్ తేజ పట్టుబడుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం చూస్తుంటే రాంచరణ్ లైన్ అప్ ఒక రేంజ్ లో కనిపిస్తోంది. ఈ దెబ్బతో ఆయన గ్లోబల్ స్టార్ గా కచ్చితంగా నిలబడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read: Wines Bandh: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆరోజు మొత్తం వైన్స్ బంద్

Also Read: Shaakuntalam 3D Trailer: విజువల్ వండర్లా శాకుంతలం.. 3D ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News