Allu Arjun: ఈ విషయంలో ప్రభాస్, మహేష్ బాబును సైతం దాటేసిన అల్లు అర్జున్..
Allu Arjun Income Tax: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ భారీ స్థాయిలోనే.. రెమ్యూనరేషన్లు అందుకుంటూ ఉంటారు. అయితే తమ రెమ్యూనరేషన్ ను బట్టి.. ఆదాయపు పన్ను కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది టాలివుడ్ లో అందరికంటే ఎక్కువ ఆదాయపు పన్ను కట్టిన హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. బన్నీ కట్టిన ఆదాయపు పన్ను మొత్తం ఎంతో తెలుసా?
Allu Arjun Income Tax Amount: ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 లో ఫార్చ్యూన్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. టాలీవుడ్ సూపర్‌స్టార్ అల్లు అర్జున్ అత్యధిక పన్ను చెల్లించిన భారతీయ సెలబ్రిటీల్లో.. ఒకరుగా తన పేరు నమోదు చేసుకున్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్, ఈ జాబితాలో చోటు సంపాదించిన ఒకే ఒక్క తెలుగు నటుడు కావడం విశేషం.
పుష్ప: ది రైజ్ సినిమాతో విశేష ప్రజాదరణ పొందిన అల్లు అర్జున్ ఈ ఏడాది రూ. 14 కోట్ల పన్ను చెల్లించారు. ఈ నేపథ్యంలో బన్నీ భారతీయ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం నుంచి అత్యధిక పన్ను చెల్లించిన టాప్ 20 సెలబ్రిటీల లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఏకంగా రూ. 92 కోట్లు పన్నుగా చెల్లించి టాప్‌లో నిలిచారు షారుఖ్.
ఆయన తర్వాత తమిళ నటుడు తలపతి విజయ్, రూ. 80 కోట్ల పన్ను చెల్లించి రెండవ స్థానంలో ఉన్నారు. ఇక టాప్ 20 జాబితాలో అల్లు అర్జున్ 16వ స్థానం చేజిక్కించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల పేర్లు టాప్ 20 జాబితాలో లేకపోవడం. ట్యాక్స్ విషయంలో అల్లు అర్జున్ ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలను సైతం డాటేశారు అన్నమాట.
అంతేకాకుండా టాలివుడ్ నుండి ఈ జాబితాలో అల్లు అర్జున్ పేరు తప్ప మరొక పేరు లేదు. అత్యధిక పన్ను చెల్లించిన టాప్ 20 భారతీయ సెలబ్రిటీల లిస్ట్ లో ఉన్న ఒకే ఒక్క టాలివుడ్ హీరో అల్లు అర్జున్. సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా అల్లు అర్జున్‌తో సమానంగా రూ. 14 కోట్ల పన్ను చెల్లించారు.
ఇక సినిమాల పరంగా చూస్తే పుష్ప సినిమాతో నార్త్ లో కూడా తనదైన స్థాయిలో ముద్ర వేసుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప 2 తో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదలకి సిద్ధం అవుతోంది.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read: KCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్ విరాళం.. కేటీఆర్, కవితతో సహా అందరూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter