Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!
Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ.. ఈ జంట యూఏఈ దేశానికి ఈ మధ్యనే వెకేషన్ కి వెళ్ళింది.
Vijay Deverakonda Rashmika Mandanna Dubai Vacation Cost: గీతగోవిందం సినిమా సెట్స్ మీద మొదటిసారిగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలుసుకున్నారు. అప్పుడే స్నేహితులగా మారిన వీరి మధ్య.. ప్రేమ చిగురించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఈ సినిమా తర్వాత నుంచి.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిజజీవితంలో కూడా డేట్ చేస్తున్నారు అని పుకార్లు మొదలయ్యాయి.
ఇక ఎప్పటికప్పుడు ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ వీరు మాత్రం ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా ఈ జంట ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా తాము ప్రేమలోనే ఉన్నామని నిరూపించుకుంది. కలిసి వెకేషన్ కి వెళ్లి ఈ జంట అభిమానులకు కనుల పండుగ చేస్తోంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ అక్కడికి వెళ్లడం విశేషం..
తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ యూఏఈ దేశంలోని ఒక పెద్ద రిసార్ట్ లో సమయం గడిపినట్లు తెలుస్తోంది. రష్మిక 28వ పుట్టినరోజు ఈమధ్యనే జరిగింది. సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఈ భామ ఎట్టకేలకి షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకొని.. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ తో తన పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడానికి రిసార్ట్ కి వెళ్ళింది.. అంటూ సోషల్ మీడియా కోడైకూస్తోంది.
కాగా ఒకేలాంటి బ్యాక్గ్రౌండ్స్ తో ఈ జంట సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ.. ఇన్ డైరెక్ట్ గా తమ ప్రేమ విషయాన్ని ఎప్పటిలానే నిరూపించుకున్నారు. కాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను షేర్ చేసిన రష్మిక అనంతారా హోటల్స్ ని కూడా ట్యాగ్ చేసింది. యూఏఈ లో ఉన్న కాస్ట్లీ రిసార్ట్ లలో అది కూడా ఒకటి. ఒక్క రాత్రి అక్కడ గడపడానికి 27 వేల నుంచి 67 వేల దాకా అవుతుంది. రోజుకి లక్ష రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి వీరి వెకేషన్ కి రోజుకి లక్ష రూపాయలు అయినట్టు తెలుస్తోంది.
https://www.instagram.com/p/C5WG41HNKkR/?igsh=YmF3bjViNmc2ZGZy
అరేబియన్ దేశంలోని అద్భుతమైన లొకేషన్స్ లో.. ప్రకృతికి దగ్గరగా.. ఈ జంట తమ వెకేషన్ గడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల పరంగా చూస్తే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ది ఫ్యామిలీ స్టార్.. ఈ మధ్యనే విడుదలై.. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది.
Also Read: Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter