Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Repeated Reservations Ban In Asifabad: పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని.. ఒక్క గాడిద గుడ్డు మాత్రమేనని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 2, 2024, 06:16 PM IST
Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను రద్దు చేస్తారని మరోసారి పునరుద్ఘాటించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో గురువారం నిర్వహించిన 'జన గర్జన' సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి  ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం చేశారు.

Also Read: Fake Video Case: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. ఫేక్‌ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్‌?

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని రేవంత్‌ రెడ్డి తెలిపారు. అలాంటి బీజేపీకి ఓటు వేసి రిజర్వేషన్‌ను రద్దు చేసుకుంటారా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారని గుర్తుచేశారు. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఇక తెలంగాణకు బీజేపీ ఏం చేసిందంటే గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేయలేదు అని విమర్శించారు.

Also Read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్‌.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తున్న ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా ప్రజల కోసం అహర్నిశలు కష్ట పడుతోందని కొనియాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యలను కేసీఆర్ ఎన్నడు పట్టించుకోలేదని విమర్శించారు. ఆదివాసీలు, గోండ్‌లు, కొమురం భీం పట్ల బీజేపీ చిన్నచూపు చూసిందని తెలిపారు

'ఆదిలాబాద్ అంటే నాకు అమితమైన ప్రేమ. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాం. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చేయలేదు' అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. '2021లో దేశ జనాభాను బీజేపీ ప్రభుత్వం చేయలేదు. మోడీ, అమిత్ షా జనగణన చేయకుండా అడ్డుకుంటున్నారు. జనాభా లెక్కింపు జరిగితే పెరిగిన జనాభాకు అనుకూలంగా కులాలకు రిజర్వేషన్లు పెంచాలి కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేయలేదు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'మీ ఓటుతో సీటు గెలిచి మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ మోడీ చూస్తున్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి' అని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News