Brahmanandam Relangi Statue Controversy: ఇప్పుడంటే ఎలాంటి వివాదమైనా చిటికెలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది కానీ ఒకప్పుడు టాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా అనేక వివాదాలు ఉండేవి. కానీ పెద్దగా బయటకి ఫోకస్ అయ్యేవి కాదు.  నిజానికి ఎలాంటి వివాదాలు లేవు ఎలాంటి మరకలు లేవు అని ప్రస్తుతం జనరేషన్ భావిస్తున్న బ్రహ్మానందం గురించి అప్పట్లో ఒక పెద్ద కాంట్రావర్సీ తెర మీదకు వచ్చింది. ఆయన కొన్ని నిధులు తన సొంతానికి వాడుకున్నాడని వాటిని వడ్డీకి కూడా తిప్పుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయాన్ని తాజాగా ఒక సీనియర్ జర్నలిస్టు వెల్లడించారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకప్పటి సీనియర్ జర్నలిస్ట్, రైటర్ అయిన తోట ప్రసాద్ మాట్లాడుతూ అప్పట్లో తాను జ్యోతి చిత్ర అనే ఒక మ్యాగజైన్ కోసం పెన్ కౌంటర్ అనే ఒక శీర్షిక నడిపే వాడిని, అందులో ఎక్కువగా కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగి నటీనటులు సమాధానాలు పొందుపరిచే వాడినని చెప్పుకొచ్చారు. కమెడియన్ మల్లికార్జునరావు అప్పట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండేవారని ఆయనను ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో కలిసినప్పుడు ఈ పెన్ కౌంటర్లో భాగంగా ఒక ప్రశ్న అడిగానని ఆయన అన్నారు.


Also Read: Virupaksha Movie Review: హారర్ థ్రిల్లర్ 'విరూపాక్ష' ఎలా ఉందో రివ్యూలో చూసేయండి!


అప్పట్లో రేలంగి విగ్రహం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రతిష్టించాలని ఉద్దేశంతో కమెడియన్లందరూ పలు కార్యక్రమాలు నిర్వహించి నిధులు సమకూర్చారని, నిధులు సమకూర్చి చాలా కాలమైనా ఎందుకు విగ్రహం ఏర్పాటు చేయలేదని? అడిగితే ఒక కమెడియన్ ఆ నిధులను వడ్డీకి తిప్పుకుంటున్నాడు అంటూ ఆయన కామెంట్ చేశారట. అయితే ఆ కమెడియన్ ఎవరు? అనే విషయాన్ని పేపర్లో రాయలేనప్పటికీ ఆ తర్వాత రోజే శివాజీ రాజా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ కమెడియన్ మరెవరో కాదు బ్రహ్మానందమే అంటూ ఆయన మీద సంచలన ఆరోపణలు గుప్పించారట.


నిజానికి తోట ప్రసాద్ బ్రహ్మానందం మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి కానీ ఇలా ఈ అంశం కాంట్రావర్సీగా మారడంతో కొన్నాళ్ల పాటు వీరిద్దరూ మాట్లాడుకోలేదట. ఆ తర్వాత కొంతకాలానికి వారిద్దరికీ మాటలకు కుదిరాయి కానీ ఈలోపే చాలామంది బ్రహ్మానందం టార్గెట్గా అనేక సంచలన ఆరోపణలు చేస్తూ అప్పట్లో వివాదానికి కారణమయ్యారట. అయితే ఈ విషయాన్ని బ్రహ్మానందం దృష్టికి తీసుకువెళ్తే ఆయన సానుకూలంగానే స్పందించి తోట ప్రసాద్ తప్పులేదనే విషయాన్ని త్వరగానే అర్థం చేసుకున్నారట.


మొత్తం మీద వివాదరహితుడుగా ఇప్పటి వారందరూ భావించే బ్రహ్మానందం కూడా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నిజంగా ఆ నదిలో బ్రహ్మానందం వాడుకున్నారా లేదా అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. అదే విధంగా రేలంగి విగ్రహం కూడా ఎక్కడా ఏర్పాటు చేయబడలేదు. అంటే ఆ నిధులు మొత్తంగా మాయమయ్యాయి అనే మాట వాస్తవమే కానీ ఈ విషయం మరుగున పడిపోయింది అన్నమాట. 


Also Read: Samantha vs Lawrence: డిజాస్టర్ దిశగా 'శాకుంతలం'.. షాకిస్తూ దూసుకుపోతున్న రుద్రుడు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook